Longevity: రోగం నొప్పులు లేకుండా వందేళ్లు బతికేయాలంటే ఈ 4 అలవాట్లు కచ్చితంగా ఉండాల్సిందే..

|

Mar 20, 2025 | 10:23 PM

జిరో సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం మన రోజూ వారి అలవాట్లే మన ఆయుర్ధాయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అందులో మన జన్యుపరమైన అంశాలదీ మరో ముఖ్య భాగం అయినప్పటికీ కూడా మన అలవాట్లతో వృద్ధాప్యాన్ని జయించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుపరమైన కారకాలు ఆయుష్షుపై ప్రభావం చూపుతాయని నిపుణులు గుర్తించారు. ఎక్కువ కాలం జీవించిన వారిలో కామన్‌గా కనిపించే నాలుగు అలవాట్ల గురించి పరిశోధకులు వివరించారు. ఆ నాలుగు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Longevity: రోగం నొప్పులు లేకుండా వందేళ్లు బతికేయాలంటే ఈ 4 అలవాట్లు కచ్చితంగా ఉండాల్సిందే..
Longivity Secrets
Follow us on

ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా బతకాలని ఎవరికుండదు చెప్పండి. కానీ, అనుకుంటే సరిపోదు. దానికోసం చిన్నపాటి కసరత్తులు, ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అలవాట్లు మిమ్మల్ని ఓ వయసు వచ్చిన తర్వాత కూడా మరొకరి మీద ఆధారపడకుండా ధీమాగా బతికేలా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న వారికి సంబంధించి అధ్యయనం చేపట్టిన పరిశోధకులు ఆ వివరాలను.. పంచుకున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి..

ఉప్పు వాడకంలోనే అసలు కిటుకు..

మంచి ఆరోగ్యంలో తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా వృద్ధాప్యం రావడానికి ప్రధాన కారణాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక స్మోకింగ్ అకాల మరణానికి ఒక కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

నిద్రలేమికి చికిత్స అవసరం..

కొందరికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. కానీ, ఎక్కువ కాలం జీవించాలనుకునే వారు నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 8 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

ఒంటి నొప్పులు చెప్పే సంకేతాలివి..

ఒంటి నొప్పులకు, జలుబుకు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మందులు వేసుకునే వారిలో కూడా వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. వీలైనంత వరకు తక్కువ మందులు తీసుకోవాలని నిఉపణులు చెబుతున్నారు. మందుల వాడకం తగ్గిస్తే శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడుతుంది.

జీవన విధానం మారాలి..

పట్టణ ప్రాంతాల్లో జీవన విధానంతో పోల్చితే, గ్రామీణ జీవనశైలి ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ జీవన విధానం దీర్ఘాయువుకు గణనీయంగా దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వాకింగ్ చేయడం, ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడం వల్ల కూడా ఆయుష్షు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

మాంసం తగ్గించాల్సిందే..

మాంసాహారం శరీరాన్ని తొందరగా వృద్దాప్యానికి, జబ్బులకు దగ్గర చేస్తుంది. మాంసాహారం అంత బలాన్ని ఇచ్చే శాఖాహార ఆహారాలు తీసుకోవడం ,తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం శాఖాహారమే బెస్ట్ ఆప్షన్. పై మూడింటిని ఆహారం నుండి తొలగించుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్లడమనే అలవాటును పాటించాలి. ప్రయాణాలు అంటే చాలామంది విసిగించుకుంటారు. కానీ ప్రయాణాలు మనిషి శరీరానికి చాలా గొప్ప ఊరడింపును ఇస్తాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఎక్కడో ఒకచోటికి వెళుతూ ఉన్నా, ప్రకృతికి దగ్గరగా చెట్లు, చేమలు, జలపాతాలు ఉన్న ప్రాంతంలో కొద్దిసేపైనా గడపడం చెప్పలేనంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. శరీరంలో ప్రాణ శక్తిని అధికం చేస్తుంది.