Lifestyle: పెళ్లికి ముందు కొడుకుకు తండ్రి నేర్పించాల్సిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా..?

ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల చదువుల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైస్కూల్‌ అయిపోగానే పై చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వెళ్లి..

Lifestyle: పెళ్లికి ముందు కొడుకుకు తండ్రి నేర్పించాల్సిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా..?
Lifestyle

Updated on: Apr 10, 2023 | 3:08 PM

ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల చదువుల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైస్కూల్‌ అయిపోగానే పై చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వెళ్లి చదువుకుంటున్నారు అది మగ పిల్లలు అయినా.. ఆడ పిల్లలు అయినా. అయితే పిల్లలు దూరంగా ఉంటే చదువు నేర్చుకుంటారు.. ఎలా బతకాలో నేర్చుకుంటారు. కానీ విలువలు నేర్చుకోవడం కొంత కష్టమనే చెప్పాలి. అయితే పిల్లలు దూరంగా ఉన్నా.. విలువలు నేర్చుకోవడం, ఇతరులకు ఎలా విలువ ఇవ్వాలి..? వంటి విషయాలను అప్పుడప్పుడు తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరికి ఎలా విలువ ఇవ్వాలో నేర్పించాలి.

ముఖ్యంగా పిల్లలు పెళ్లీడుకు వచ్చారంటే తర్వాత జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి..? సంపారం విషయంలో ఎలా ప్రవర్తించాలి.. ఎవరితో ఎలా ఉండాలి..? భార్యతో ఎలా మమేకం కావాలి.. వంటి విషయాలను తల్లిదండ్రులు నేర్పించడం తప్పనిసరి. అదే ఆడ పిల్ల అయితే పెళ్లి తర్వాత భర్తలో ఎలా ఉండాలి.. అత్త మామలను ఎలా చూసుకోవాలి వంటి విషయాలను నేర్పించాలి. ఇలా మగ, ఆడ పిల్లలను తల్లిదండ్రులు అన్ని రకాలుగా నేర్పించడం చాలా ముఖ్యం. ముందుగానే నేర్పించడం వల్ల పెళ్లి తర్వాత ఎలా ఉండాలో.. ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

పెళ్లి తర్వాత భార్యకు గౌరవం ఎలా ఇవ్వాలనే దానిపై తండ్రి కొడుకుకు నేర్పించాలి. అంతేకాదు నిజాయితీగా ఉండటం కూడా నేర్పించడం చాలా ముఖ్యం. సంసార సగరంలో నిజాయితీగా లేనట్లయితే ఆ బంధం నిలబడదని కొడుక్కి చెప్పాలి.

ఇవి కూడా చదవండి

గొడవలు జరిగినప్పుడు రాజీ పడాలి..

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం అనేది సహజం. అలాంటి సమయంలో రాజీపడాలని చెప్పాలి. ముందగానే ఇలా నేర్పించడం వల్ల గొడవలు జరిగినప్పుడు అవి పెద్దగా కాకుండా సద్దుమణిగిపోతాయి. పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నేర్పించడం వల్ల కాపురాలు చక్కగా ఉంటాయి. గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోవాలనే గుణం వారిలో ఏర్పడుతుంది. కుటుంబ అన్న తర్వాత చిన్న చిన్న కలహాలు రావడం సహజమని, చిన్న చిన్న తప్పులను క్షమించుకుంటూ సర్దుకుపోవాలని తండ్రి కొడుక్కి నేర్పించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి