Beauty Tips: చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 9 విషయాలు తెలుసుకోండి..

Beauty Tips: చర్మం యవ్వనంగా కనిపించడం మంచి ఆరోగ్యానికి సంకేతం. అయితే చర్మ సంరక్షణ కోసం కొన్ని పద్దతులు పాటించాలి. మాయిశ్చరైజింగ్, టోనింగ్

Beauty Tips: చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 9 విషయాలు తెలుసుకోండి..
Skincare

Updated on: Sep 10, 2021 | 6:17 PM

Beauty Tips: చర్మం యవ్వనంగా కనిపించడం మంచి ఆరోగ్యానికి సంకేతం. అయితే చర్మ సంరక్షణ కోసం కొన్ని పద్దతులు పాటించాలి. మాయిశ్చరైజింగ్, టోనింగ్ (CMT) క్రమం తప్పకుండా చేయాలి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని విషయాల గురంచి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మ రకం ఆధారంగా ఉత్పత్తులను వాడితే మంచిది. ఎండలో వెళ్లేటప్పుడు మంచి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. మేకప్ వేసుకుని పడుకోవద్దు. పూర్తిగా తీసివేసి ఫేస్ వాష్‌ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసి నిద్రించాలి. చర్మానికి హాని కలిగించే రసాయనాలకు దూరంగా ఉంటే మంచిది.

2. ముఖం, శరీరం కోసం వివిధ మాయిశ్చరైజర్‌లు, ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను తప్పక ఉపయోగించాలి. చర్మం రకం ప్రకారం ఎల్లప్పుడూ మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. మొటిమల సమస్య ఉంటే ప్రత్యేక టవల్ ఉపయోగించాలి. అలాగే కచ్చితమైన డైట్ కూడా ఫాలో కావాలి.

3. ప్రతిరోజు సమృద్ధిగా నీరు తాగాలి. కనీసం రోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి. నీరు చెమట ద్వారా చాలా విషాన్ని బయటకు పంపుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తినాలి.

4. వేయించిన, జిడ్డుగల వస్తువులను నివారించాలి. ఎక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు చర్మ ఆరోగ్యానికి హానికరం.

5. చక్కెర, స్వీట్లు మానుకోండి. ఎందుకంటే చక్కెర కొల్లాజెన్‌ను తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. గ్లూకోజ్ గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.

6. పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

7. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినాలి. నారింజ, ద్రాక్ష, బెర్రీలు, సీజనల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

8. నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలి. వేరుశెనగ, వాల్‌నట్స్, హాజెల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

9. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. మీరు శాఖాహారులు అయితే పప్పులు, చిక్కుళ్ళు, పనీర్, టోఫు ఎక్కువగా తినాలి. మీరు మాంసాహారి అయితే గుడ్లు, చేపలు తినాలి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.

Crime News: జగిత్యాల జిల్లాలో దారుణం.. అనుమానంతో సొంత భార్యను చంపేసి ఏం చేశాడంటే..?

Cough: మీరు ఒక్కసారి దగ్గితే చాలు మీకున్న వ్యాధి ఏమిటో ఈ యాప్ చెబుతుంది..ఎలాగంటే..

Narcotics Jihad: లవ్ జిహాద్‌ పేరుతో నయా వంచన.. దుమారం రేపుతున్న కేరళ బిషప్ వ్యాఖ్యలు..!