Beauty Care: హీరోయిన్ లాంటి అందం కోరుకునే వారు ఈ ఆకును తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..!

|

Sep 13, 2024 | 9:36 PM

శీతాకాలంలో మీ పెదవుల సంరక్షణకు సహాయపడుతుంది. మునగాకుల్లోని పోషకాలు ముఖంపై మచ్చలను నివారించడంలో సహాయపడతాయి. ఇది మీ ముఖానికి ఇవెన్‌ టోన్‌ ఇవ్వడం ద్వారా మీ ఛాయ మెరుగుపడుతుంది. చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ అందిస్తాయి.

Beauty Care: హీరోయిన్ లాంటి అందం కోరుకునే వారు ఈ ఆకును తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..!
Drumstick Leaves
Follow us on

మునగాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మన చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు కూడా ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకుల్లో యాంటీట్యూమర్, యాంటిపైరేటిక్, యాంటీపైలెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటిస్పాస్మోడిక్, డైయూరిటిక్, యాంటీహైపెర్టెన్సివ్, యాంటీ డయాబెటిక్, హెపాటోప్రొటెక్టివ్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇక మునగాకు వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీ బ్యూటీ రొటీన్‌లో మునగాకు యాడ్‌ చేసుకుంటే ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. దీంతో, మీరు యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఇందులోని విటమిన్ ‘సి’ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. మునగ ఆకులోని పోషకాలు.. ఫ్రీ రాడికల్స్‌ డ్యామేజ్‌‌ను నివారిస్తాయి. మునగాకు ఫేస్‌ ఫ్యాక్‌, మునగాకు ఆయిల్‌.. ముడతలు, గీతలు రాకుండా రక్షిస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మునగ నూనెలో ఉండే విటమిన్ సి, ఇ చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలకు చక్కని పరిష్కారం. కొలాజెన్‌ చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. ముఖంపై సన్నటి గీతలుంటే అది తగ్గుముఖం పట్టి మీ చర్మం తాజాగా, అందంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మునగాకు నూనె ముఖంపై రాస్తే.. దాని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా మొటిమలను నివారించవచ్చు. మునగాకు మీ డైట్‌లో చేర్చుకుంటే.. శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వస్తాయి. మునగాకు నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాల వల్ల చర్మంపై కాలిన మచ్చలు, గాయాలు.. వంటివి త్వరగా నయమవుతాయి. మునగాకు ఓపెన్‌ పోర్స్‌ను తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచే.. కొల్లాజెన్‌ ప్రొటిన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మునగాకు తింటే రక్తంలో వ్యర్థ పదార్థాల కారణంగానూ.. మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మునగాకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో మొటిమలను నివారించవచ్చు, ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు. అంతేకాదు.. లిప్‌ బామ్స్‌, పెదవుల సంరక్షించే.. ఉత్పత్తులలో మునగాకు నూనెను వాడుతుంటారు. ఇది పెదవుల సున్నితమైన చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది. శీతాకాలంలో మీ పెదవుల సంరక్షణకు సహాయపడుతుంది. మునగాకుల్లోని పోషకాలు ముఖంపై మచ్చలను నివారించడంలో సహాయపడతాయి. ఇది మీ ముఖానికి ఇవెన్‌ టోన్‌ ఇవ్వడం ద్వారా మీ ఛాయ మెరుగుపడుతుంది. చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..