Inspiring Story Dr. Malvika Iyer: డాక్టర్ మాళవిక అయ్యర్ ఆమె కథ ఓ ధైర్యం, ఓర్పు ,దృఢ సంకల్పానికి నిదర్శనం. పట్టుదలకు పర్యాయరూపం మాళవిక అయ్యర్. 13 ఏళ్ల వయసులో బాంబు పేలిన ఘటనలో రెండు చేతులను కోల్పోయారు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దైర్యంగా ముందడుగు వేశారు. విషాదం నుంచి కోలుకుని పీహెచ్‌డీ చేసింది. అంతర్జాతీయ ప్రేరణాత్మక వక్తగా నిలిచారు మాళవిక అయ్యర్.
“అంగీకారం అనేది మనకి మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి. మనం మన జీవితాలను నియంత్రించలేము కానీ మనం ఖచ్చితంగా జీవితం పట్ల మన వైఖరిని నియంత్రించవచ్చు అంతేకాదు మన జీవితంలో ఎదురయ్యే మన సవాళ్లను మనం ఎలా తట్టుకుంటామనేది చాలా ముఖ్యమని మాళవిక అయ్యర్ చెబుతారు.
డాక్టర్ అయ్యర్ 13 సంవత్సరాల వయస్సులో భయంకరమైన బాంబు పేలుడు నుండి బయటపడ్డారు. అప్పుడు ఆమె తన రెండు చేతులు కోల్పోయింది. కాళ్ల తీవ్రంగా గాయపడ్డాయి. అయితే అయ్యర్ చదువుకోవాలనే పట్టుదలను వదలలేదు. చాలా కష్టపడి పిహెచ్‌డి పూర్తి చేశారు. దీంతో మాళవిక “వదులుకోవడం ఎప్పటికీ ఎంపిక కాకూడదు.. అందుకనే మన పరిమితులు ఇదే అంటూ కండిషన్స్ పెట్టుకోకుండా విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే ఆశతో అనుకున్నది సాధించవచ్చు అని చెబుతారు మాళవిక అయ్యర్.
అంతేకాదు సమాజంలో మార్పు కోసం విద్య అనివార్యమని డాక్టర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్నీ ప్రధాని మోడీకి ట్విట్టర్ వేడిగా సూచించారు. మోడీ ట్విట్టర్ ఖాతాలో “వివక్షత వైఖరుల గురించి మనం యువత మనస్సును చైతన్యపరచాలి. వికలాంగులను బలహీనంగా, ఆధారపడేవారిగా చూపించడానికి బదులుగా రోల్ మోడల్స్‌గా చూపించాలి. అప్పుడు అది మరికొందరికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ప్రధానికి మాళవిక అయ్యర్ ట్విట్టర్ వేదికగా కృతఙ్ఞతలు చెప్పారు. వైకల్యానికి సంబంధించిన పాత మూఢనమ్మకాలను విడిచి పెట్టి.. సరికొత్త పంథాలో భారత దేశం పయనిస్తుందని తాను నమ్ముతున్నట్లు మాళవిక అయ్యర్ చెప్పారు.