ఖాళీ కడుపుతో ఈ ఒక్క పండును తింటే చాలు..హైపర్‌టెన్షన్‌తో పాటు కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయ్..!

|

Jun 07, 2024 | 11:37 AM

అధిక రక్తపోటు, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి గుండె సమస్యలను తగ్గించడంలో కివీ పండు ఉపయోగపడుతుంది. రోజూ రెండు మూడు కివీ పండ్లను తినడం వల్ల కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కరిగి శరీరాన్ని నీరుగా మారుస్తుంది. అంతేకాకుండా కిడ్నీ స్టోన్ కూడా కరిగిపోతుంది.

ఖాళీ కడుపుతో ఈ ఒక్క పండును తింటే చాలు..హైపర్‌టెన్షన్‌తో పాటు కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయ్..!
డయాబెటిక్ రోగులు కివి పండును తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, తక్కువ కేలరీలు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండుతో సెరోటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రుళ్లు నిద్ర బాగాపడుతుంది.
Follow us on

కమలాపండుకు రెట్టింపు విటమిన్‌ సి, ఆపిల్‌లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కలిగినది కివి పండు. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాలతో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కివీ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైములు, విటమిన్ సి ఉంటాయి. కివీ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన పోషకాలు ఉన్నాయి. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఈ పోషకాలన్నీ అవసరం.

కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండును హ్యాపీగా తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను కివీ పండు తొలగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి లభించే అనేక పోషకాలు ఒక్క కివీ పండు తినడం వల్ల కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఒక కివిలో 215 mg పొటాషియం ఉంటుంది. కివి వినియోగం మీ రక్తపోటు, నరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి గుండె సమస్యలను తగ్గించడంలో కివీ పండు ఉపయోగపడుతుంది.
రోజూ రెండు మూడు కివీ పండ్లను తినడం వల్ల కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కరిగి శరీరాన్ని నీరుగా మారుస్తుంది. అంతేకాకుండా కిడ్నీ స్టోన్ కూడా కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..