
అలంకరణ నుంచి షాపింగ్, ఇంటిని శుభ్రపరచడం వరకూ దీపావళి పండగకు సన్నాహాలు కొన్ని రోజుల ముందు నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే దీపావళి పండగకు ఇంటి మూల మూల శుభ్రం చేసుకోవాలని భావిస్తారు. అందుకనే దీపావళికి ముందు ఇంటిలో పాత వస్తువులన్నింటినీ తొలగిస్తారు. ఇంటి మూల మూలను శుభ్రం చేస్తారు. కిటికీలు, తలుపులు, పూజ గదిని, వంట గదిని శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే వంటగదిని శుభ్రం చేయడం అంటే ఒక యుద్ధమే చేయాలి. ఎందుకంటే వంట గది గోడలు, జిగురుతో ఉంటాయి. ఇంక వంట గదిలో ఉండే పాత్రలు, సీసాలు కూడా జిడ్డుగా.. నూనె మరకలతో శుభ్రం చేయడం ఒక సవాలుగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ పనులను త్వరగా పూర్తి చేయవచ్చు.
బేకింగ్ సోడా: వంట గదిలోని గోడలపై జిడ్డు మరకలు ఉంటే.. వాటిని ఎక్కువసేపు రుద్దడానికి బదులుగా, బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి పేస్ట్‌గా తయారు చేసి అప్లై చేయండి. కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోండి. ప్రత్యామ్నాయంగా.. డిష్ వాషింగ్ లిక్విడ్‌ను గోరువెచ్చని నీటితో కలిపి గోడలను శుభ్రం చేయవచ్చు.
వెనిగర్: జిడ్డుతో ఉండే వంటగది గోడలను శుభ్రం చేయడానికి వెనిగర్ నీటి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. దీనిని స్ప్రే బాటిల్‌లో పోసి గోడలకు అప్లై చేయండి. కనీసం 20 నిమిషాలు ఇలాగే ఉంచి తర్వాత గోడలను స్క్రబ్బర్‌తో తుడవండి.
వేడి చేసి మరకలను తొలగించండి: జిడ్డు మరకలు చాలా ఎక్కువగా ఉంటే.. శుభ్రం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు గోడకు పెద్ద కాగితాన్ని అంటించి.. హెయిర్ డ్రైయర్ లేదా ఐరెన్ బాక్స్ తో కాగితాన్ని వేడి చేయండి. ఇది గ్రీజు అంతా కరిగించి కాగితానికి బదిలీ చేస్తుంది. తరువాత స్క్రబ్బర్‌కి డిటర్జెంట్ లేదా డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను అప్లై చేసి గోడను శుభ్రం చేయండి. .
వంటగదిలోని పాత్రలు జిడ్డుగా మారితే.. వాటిని వేడి నీటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి.. ఈ నీటిలో కాసేపు నానబెట్టండి. తర్వాత స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మకాయ పేస్ట్ కూడా కంటైనర్లను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.
వంటగది పాత్రలు, జిడ్డుగల గోడలను శుభ్రం చేయడమే కాదు.. రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి చాలా శ్రమ అవసరం. ఈ పాత్రలను దీపావళికి తప్పనిసరిగా శుభ్రం చేస్తారు. మీరు రాగి , ఇత్తడి వస్తువులను కూడా శుభ్రం చేయవలసి వస్తే నిమ్మకాయ, ఉప్పు కలిపి పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించండి. చింతపండు నీరు, వెనిగర్ కూడా రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)