Kitchen: ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. వెంటనే ఆరోగ్యం మెరుగవుతుంది..?

|

Jan 08, 2022 | 5:04 PM

Kitchen: కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎందుకంటే కిచెన్‌లోనే మొత్తం ఆహారం తయారవుతుంది కాబట్టి. కానీ కొంతమంది కిచెన్‌ గదిని

Kitchen: ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. వెంటనే ఆరోగ్యం మెరుగవుతుంది..?
Plastic
Follow us on

Kitchen: కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎందుకంటే కిచెన్‌లోనే మొత్తం ఆహారం తయారవుతుంది కాబట్టి. కానీ కొంతమంది కిచెన్‌ గదిని అస్సలు పట్టించుకోరు. చిందరవందరగా, మురికి మురికిగా ఉన్నా కూడా ఆ వాతావరణంలోనే వంట చేస్తారు. అందుకే ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌ అవుతోంది. పిల్లలు వ్యాధులకు గురికావడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి కిచెన్‌ని ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వస్తువులను చాలారోజులు కిచెన్‌లో ఉంచకూడదు. ఎందుకో తెలుసుకుందాం.

1. రిఫైన్డ్ ఆయిల్: ఇది ఆహారాన్ని చాలా రుచికరంగా మార్చినప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శరీరానికి చాలా హాని చేస్తుంది. వంటగది నుంచి తీసివేయండి. మీకు సరిపడ ఆయిల్‌ని ఎంచుకోండి.

2. ప్లాస్టిక్ వస్తువులు: వంటగదిలో ఎక్కువ కాలం ఉంచిన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీలైనంత త్వరగా వంటగది నుంచి వాటిని బయటకు తీయండి. ఇవి వేడి వాతావరణంలో ఎక్కువ కాలం ఉండకూడదు మంచిది కాదు.

3. ఓపెన్ మసాలా దినుసులు: మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తాజా మసాలా దినుసులను మాత్రమే ఉపయోగించండి. మసాలా దినుసులు 25 రోజుల కంటే ఎక్కువ ఉంటే వాటిని వంటగది నుంచి తీసివేయాలి. లేదంటే ఆరోగ్యానికి హానికరం.

4. అల్యూమినియం: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్యూమినియం వస్తువులతో వంట చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో వండటం వల్ల ఉదర సమస్యలు ఏర్పడుతాయి.

5. మైక్రోవేవ్: ఆహార పదార్థాలను వేడిచేయడం సులభం చేసినప్పటికీ దీని ఉపయోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వంటగది నుంచి ముందుగా దీనిని తొలగించండి.

Chapati: కరోనా సమయంలో వీటితో చేసిన చపాతీలు బెస్ట్.. రోగనిరోధక శక్తిపెంచడంలో సూపర్..

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మీ అకౌంట్‌ బ్లాక్ అయిందని మెస్సేజ్ వచ్చిందా..?

Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?