Kitchen Hacks : వంటగదిలో అత్యంత ముఖ్యమైన విషయం గ్యాస్ స్టౌవ్.. ఇది లేకుండా ఏ వంట చేయలేం. ఇంటిల్లిపాదికి భోజనం కష్టమే.. అయితే, నేడు కిచెన్‌లలో ఇండక్షన్, మైక్రోవేవ్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ, వంట చేసేందుకు ఎక్కువ మంది, కొన్న వినియోగించేది మాత్రం గ్యాస్ స్టౌవ్ అని చెప్పాలి. ఇండక్షన్, మైక్రోవేవ్‌లను వాడే వారు కూడా కొన్ని రకాల వంటల కోసం గ్యాస్ స్టౌవ్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, గ్యాస్ స్టౌవ్ విషయంలో అనేక జాగ్రత్త చర్యలు తప్పనిసరి. గ్యాస్‌స్టౌవ్‌ని ఉపయోగించడంలో కూడా సరైన పద్ధతి ఉంది. భద్రత పరంగా గ్యాస్ స్టౌవ్ ఉపయోగించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మంది గ్యాస్ స్టౌవ్ వాడకంలో లేనప్పుడు సిలిండర్ ఆఫ్ చేస్తారు. కానీ, కొందరు గ్యాస్ స్టౌవ్ బటన్‌ను ఆఫ్ చేస్తారు. అలాగే, కొంతమంది గ్యాస్ స్టౌవ్ వెలిగించేటప్పుడు లైటర్‌ని ఉపయోగిస్తే, మరికొందరు అగ్గిపెట్టే వాడుతుంటారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గ్యాస్ స్టౌవ్ ఆన్ చేయటానికి లైటర్ వాడకం మంచిదా..? లేదంటే, అగ్గిపెట్టే వాడితే మంచిదా..? ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు గ్యాస్ స్టౌవ్‌ను అగ్గిపెట్టేతో వెలిగిస్తున్నట్లయితే, ముందుగా స్టిక్‌ను వెలిగించి, ఆపై గ్యాస్ స్టౌవ్ బటన్‌ను ఆన్ చేయండి. తద్వారా గ్యాస్ స్టౌవ్ త్వరగా వెలిగిపోతుంది. ప్రతిసారి గ్యాస్ స్టౌవ్ అగ్గిపెట్టేతో మాత్రమే వెలిగించే వారు ముందు గ్యాస్ ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే గ్యాస్‌ను వృధా చేయడమే కాకుండా, ఎక్కువ వాయువును గాలిలోకి విడుదల చేస్తుంది. గ్యాస్ ఆన్ చేసిన తర్వాత అగ్గిపుల్లను వెలిగిస్తే.. అది కొన్ని సందర్భాల్లో అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. కొన్నిసార్లు చేతులు కాలే ప్రమాదం కూడా ఉంటుంది. గ్యాస్‌ను వెలిగించే సమయంలో గ్యాస్ స్టౌవ్ సిమ్‌లో ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీ సౌకర్యాన్ని బట్టి గ్యాస్ స్టౌవ్ మంటను పెంచుకోవచ్చు. లేదంటే తగ్గించవచ్చు. కానీ గ్యాస్ స్టౌవ్ ఆన్ చేస్తున్నప్పుడు స్టౌవ్ హైలో ఉంటే..గ్యాస్ ఎక్కువ వచ్చి పెద్ద మంట మండుతుంది.
గ్యాస్ ఆన్ చేసిన వెంటనే వెలిగించకపోయినా, ఏ మాత్రం ఆలస్యం చేసినా వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి. వెలిగించిన అగ్గిపుల్లను తక్షణమే ఆర్పివేయండి. గ్యాస్ స్టౌవ్ నుండి వచ్చే గ్యాస్ గాలిలో కలిసిపోతుంది.
ఇలాంటప్పుడు గ్యాస్‌ను నిలిపివేసినా, అగ్గిపుల్లను వెలిగించిన తర్వాత గాలిలో వ్యాపించిన వాయువు ప్రమాదకరం. కాబట్టి కొంత సమయం వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. ఇలాంటప్పుడు అగ్గిపుల్లకి బదులుగా లైటర్‌తో గ్యాస్‌ను వెలిగించడం మంచిది. ఎందుకంటే అగ్గిపుల్లని ఉపయోగించడంలో కొంచెం అజాగ్రత్త ప్రమాదకరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..