ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటిస్తే కాసుల వర్షమే!

చాలామంది ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి, ప్రశాంతత కోసం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం, చైనీస్ ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంట్లో అక్వేరియం ఉంచడం కేవలం అందానికి మాత్రమే కాకుండా, అదృష్టాన్ని, సంపదను ఆకర్షించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా అక్వేరియంలో గోల్డ్ ఫిష్ పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లో గోల్డ్ ఫిష్ ఉంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు తప్పని సరి!

ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటిస్తే కాసుల వర్షమే!
Goldfish Vastu

Updated on: Sep 04, 2026 | 12:07 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియం, గోల్డ్ ఫిష్ పెంచడం ఎంతో పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో గోల్డ్ ఫిష్‌లను పెంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. అక్వేరియంను సరైన దిశలో ఉంచడం వల్ల శాంతి, సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అక్వేరియంలోని నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ శుభ్రంగా ఉంచడం వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

గోల్డ్ ఫిష్ వాస్తు చిట్కాలు, నియమాలు:

చేపల సంఖ్య ఎంతో ముఖ్యం:

వాస్తు ప్రకారం, అక్వేరియంలో మొత్తం 9 చేపలు ఉండాలి. ఇందులో 8 గోల్డ్ ఫిష్‌లు, 1 నల్లటి చేప ఉండటం అత్యంత శుభప్రదం. ఈ నల్లటి చేప ఇంట్లోకి వచ్చే దిష్టి, నజర్, ప్రతికూల శక్తులను పీల్చుకుని, కుటుంబాన్ని దురదృష్టాల నుండి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

అక్వేరియం ఉంచాల్సిన సరైన దిశ:

అక్వేరియంను ఇంటి ఈశాన్యం లేదా ఉత్తర దిశలో (North) ఉంచాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ దిశలో వాస్తు ప్రకారం అక్వేరియం ఉంచడం వల్ల ధనాకర్షణ పెరిగి, వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. హాలు ఆగ్నేయంలో కూడా ఉంచవచ్చు, కానీ, బెడ్‌రూమ్ లేదా వంటగదిలో అస్సలు ఉంచకూడదు.

నీటి ప్రవాహం – సంపద ప్రవాహం:

అక్వేరియంలోని నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఇంట్లో సానుకూల శక్తి అంతగా పెరుగుతుంది. అక్వేరియంలో నీటి పంప్ ద్వారా వచ్చే తరంగాలు లేదా నీటి కదలికలు ఇంట్లోకి ధనం నిరంతరం ప్రవహించేలా చేస్తాయి.

చేప చనిపోతే ఏం చేయాలి?:

అక్వేరియంలో ఏదైనా చేప సహజంగా చనిపోతే కంగారుపడాల్సిన అవసరం లేదు. వాస్తు ప్రకారం, ఆ చేప మీ ఇంటిపై రాబోయే ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని లేదా సమస్యను తనపై వేసుకుని చనిపోయిందని అర్థం. చనిపోయిన చేపను వెంటనే తీసేసి, దాని స్థానంలో కొత్త గోల్డ్ ఫిష్‌ను తీసుకువచ్చి ఉంచాలి.

ఇంట్లో గోల్డ్ ఫిష్‌లను పెంచడం వల్ల మనస్సులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. వాస్తు నియమాలను పాటిస్తూ సరైన దిశలో అక్వేరియంను ఏర్పాటు చేసుకుంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడమే కాకుండా, సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us