Japanese Arigatou philosophy: ఈ జపాన్ టెక్నిక్‌ ఫాలో అయితే డబ్బులే డబ్బులే..ఒకసారి ట్రై చేయండి..

|

Oct 31, 2024 | 8:37 AM

మనం డబ్బు ఎంత సంపాదించిన పొదుపు చేయకుంటే వేస్ట్..అందుకే డబ్బును వివిధ పద్దతుల్లో పొదుపు చేస్తారు. ఇందులో ముఖ్యంగా చాలమంది వివిధ సంప్రదాయక పద్దతులను ఫాలో అవుతుంటారు. పొదుపు విషయంలో జపనీస్ ముందు వరుసలో ఉంటారు. వాళ్లు 'ఎరిగాటు' తత్వశాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు. పొదుపు విషయంలో ఈ పద్ధతిని అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. 'ఎరిగాటు' పొదుపు విధానంపై ఓ లుక్కేయండి..!

Japanese Arigatou philosophy: ఈ జపాన్ టెక్నిక్‌ ఫాలో అయితే డబ్బులే డబ్బులే..ఒకసారి ట్రై చేయండి..
Japanese Arigatou Philosoph
Follow us on

జపానీస్ సంస్కృతి, వారసత్వం చాలా ప్రత్యేకమైనవి. అక్కడి ప్రజల ఆలోచనా విధానం, ప్రవర్తన, దృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. జపనీస్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు. జపనీస్ ప్రజలు గొప్ప ఆలోచనాపరులని చెప్పాలి. వారు  డబ్బు విషయంలో ‘ఎరిగాటు’ అనే సూత్రాన్ని పాటిస్తారు. జపనీయులు డబ్బును భిన్నంగా చూస్తారు. ‘ఎరిగాటు’ తత్వశాస్త్రం ప్రకారం వారు డబ్బును శక్తి రూపంగా భావిస్తారు. ముందు సంపాదించిన డబ్బు ఆదా చేసి తర్వాత ఖర్చు చేయాలనేది వాళ్లు నమ్మే ఫిలాసఫీ. జీతంలో కొంత మొత్తాన్ని సేవ్ చేసి మిగితా డబ్బును ఖర్చులకు వినియోగించుకుంటారు.

జపాన్ ప్రజలు లోన్, బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై అంతగా ఆసక్తి కనబరించారు.  అభివృద్ధి చెందిన దేశాలలో జపనీయులు అతి తక్కువ వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటారు. అక్కడి బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే లభిస్తున్నప్పటికీ చాలా మంది రుణాలు తీసుకోరు. అత్యవసరమైతేనే రుణం జోలికి వెళ్లారు. భౌతిక జీవితం, ఆర్థిక జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. అవసరమైన వస్తువులను మాత్రమే వారు కొనుగోలు చేస్తారు. అనవసరమైన వస్తువులపై జపనీయులు ఖర్చు చేయారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి