ప్రస్తుత కాలంలో అంతా బిజీ బిజీ అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు అంతా ఉరుకులు పరుగులే.. దీంతో సరైన సమయానికి తిండి కూడా తినడం లేదు. దీంతో అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అకారణంగానే బరువు పెరుగుతున్నారు. ఇలా బరువు పెరగడంలో ఆడవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి మూడో వంతు ఆడవారు వేగంగా బరువు పెరుగుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ వాళ్లు ఎందుకు బరువు పెరుగుతున్నారో కూడా తెలీదు. చాలా మంది ఎక్కువగా తినేస్తున్నాం అందుకే బరువు పెరుగుతున్నారని అనుకుంటారు. దీంతో తిండిని కూడా తగ్గించేస్తున్నారు. ఇంత ఫాస్ట్‌గా ఎందుకు బరువు పెరుగుతున్నామని భయ పడుతూ ఉంటారు. అయితే ఆడవారు బరువు పెరగడంలో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఆడవారు బరువు పెరగడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఎందుకంటే వీరు సరైన సమయానికి తినరు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే ఆడవారు.. తమ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. దీంతో సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. మిగిలిపోయిన ఆహారాలు కూడా తింటూ ఉంటారు. ఇలా దీని వలన బరువు పెరుగుతూ ఉంటారు.
అదే విధంగా చాలా మంది లేడీస్ రాత్రి పూట వేయించిన ఆహారాలు తింటూ ఉంటారు. దీని వలన జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగక.. వేగంగా బరువు పెరుగుతున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఆడవారు బయట పనులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. కానీ ఈ ఒత్తిడి వల్ల కూడా శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీని వలన బరువు పెరుగుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఆడవారు ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని పని చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా శరీరంలో ఫ్యాట్స్ కూడా పెరిగిపోతాయి. ఇలాగే ఊబకాయం వస్తుంది. కాబట్టి వీరు వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో పనులు చేసినా కూడా.. కనీసం రోజుకు అరగంట సేపు అయినా.. వ్యాయామం ఖచ్చితంగా చేయాలి.
నిద్ర సరిగా లేని కారణంగా కూడా బరువు పెరుగుతారు. ఇంట్లో పని భారం.. బయట పని భారం కారణంగా ఆడవారికి సరిగా నిద్ర పోరు. ఈ కారణంగా కూడా శరీరంపై ఎఫెక్ట్ పడి.. బరువు పెరుగుతారు. నిద్ర సరిగా లేకపోతే హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అయి.. మెటబాలిజం అనేది మందగిస్తుంది. దీని వలన ఆకలి పెరిగి.. బరువు పెరుగుతారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..