Food: వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ప్రమాదామా.? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Aug 25, 2024 | 9:21 AM

వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న దాంట్లో పూర్తిగా నిజం లేకపోయినా.. కొంతమేర మాత్రం వాస్తవం ఉందని చెప్పాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకు కూరలు బురదగా మారుతాయి. అలాగే ఈ సీజన్‌లో గాల్లే తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వైరస్‌, బ్యాక్టీరియా ఆకులపై పేరుకుపోతాయి. వర్షాకాలంలో బ్యాక్టీరియాలు...

Food: వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ప్రమాదామా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Lifestyle
Follow us on

ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే కచ్చితంగా తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆకుకూరలను వర్షాకాలంలో తీసుకోకూడదని చాలా మంది భావిస్తుంటారు. ఈ సీజన్‌లో ఆకుకూరలు తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటారు. ఇంతకీ వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకుంటే ఏమవుతుంది.? నిజంగానే ఏమైనా నష్టాలు ఉంటాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న దాంట్లో పూర్తిగా నిజం లేకపోయినా.. కొంతమేర మాత్రం వాస్తవం ఉందని చెప్పాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకు కూరలు బురదగా మారుతాయి. అలాగే ఈ సీజన్‌లో గాల్లే తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వైరస్‌, బ్యాక్టీరియా ఆకులపై పేరుకుపోతాయి. వర్షాకాలంలో బ్యాక్టీరియాలు తమ సంతానోత్పత్తిని పెంచుకునే ప్రదేశంగా ఆకుకూరలను మార్చుకుంటాయి. కాబట్టి ఆకు కూరలను శుభ్రం చేసుకొని తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

అంతేకానీ ఆకు కూరల వల్ల నేరుగా ఎలాంటి ప్రమాదం ఉండదు. వీటిపై పేరుకుపోయే వైరస్‌, బ్యాక్టీరియా కారణంగా ఫుడ్‌ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో డయేరియా, కడుపులో నొప్పితో పాటు ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా అని ఆకు కూరలకు పూర్తిగా ఉండాల్సిన పనిలేదని. బాగా శుభ్రం చేసుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఆకు కూరలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఆకు కూరలను అన్నింటినీ వేరు చేయాలి. ఆ తర్వాత ఆకులను పొడి క్లాత్‌పై వేసి ఆరబెట్టాలి. దీంతో తేమ పోతుంది. ఇక ఆకు కూరలను వండే ముందు ఉప్పు వేసిన నీటిలో కొంతసేపు ఉడకబెట్టడం మంచిది. ఇలా చేస్తే వర్షాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పవు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..