సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో రైలులో టిక్కెట్లు పొందడం సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు పైన బెర్త్ కేటాయిస్తే.. వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధురాలు అలాంటి ఉదంతమే తెరపైకి వచ్చింది. ఆమెకు రైల్వేశాఖ అప్పర్ బెర్త్ టికెట్ కేటాయించింది. రుమాటిజంతో బాధపడుతున్న మహిళకు రైలులో టాప్ బెర్త్ కేటాయిస్తే.. ఆమె పరిస్థితి ఏమవుతుందో? మీరు ఊహించగలరా..? ఈ ఘటన తర్వాత IRCTC కొత్త నియమాలను తీసుకొచ్చింది.
IRCTC నియమాలు ఇవే..
ఒక ట్విటర్ యూజర్ IRCTCని ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో ఇలా ప్రశ్నించారు, ‘నా కుటుంబంలోని ఇద్దరు వృద్ధ మహిళలు, మా అమ్మ, అమ్మమ్మలకు పై బెర్త్‌లు కేటాయించబడ్డాయి. టిక్కెట్‌ను రూపొందించడానికి మీరు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్నారు? 70-80 ఏళ్ల వయసులో పై బెర్త్ ఎక్కగలరా? ఒక వృద్ధ మహిళ తన సీటుపై ఎలా ఎక్కగలదంటూ ట్వీట్ చేశారు. ఆర్థరైటిస్ పేషెంట్ పై బెర్త్‌కి ఎలా ఎక్కగలుగుతారు? దయచేసి నాకు సమాధానం ఇవ్వండి.. ఇదేనా ప్రజలకు మీరు అందిస్తున్న సేవ? దీని తరువాత, రైల్వే సేవ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి IRCTC ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ పూర్తి నియమాలను తెలిపింది.
భారతీయ రైల్వే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్‌లో 45 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు, మహిళా ప్రయాణీకులకు ఆటోమేటిక్ లోయర్ బెర్త్‌లు కేటాయించబడతాయి. మీరు ఏ ఎంపికను ఎంచుకోకపోయినా. ఇంకా, సీనియర్ సిటిజన్ల కేటగిరీలోకి రాని సీనియర్ సిటిజన్‌లతో పాటు మరొకరు ప్రయాణిస్తున్నట్లయితే… ఈ సందర్భాలలో కింది బెర్త్‌లు ఇవ్వడాన్ని రైల్వే పరిగణలోకి తీసుకుందని తెలిపింది.
@IRCTCofficial what logic do you run for seat allocation, I had booked tickets for 3 senior citizens with preference of lower berth , there are 102 berths available, yet allocated berths are middle, upper and side lower. U need to correct same.@AshwiniVaishnaw
— jitendra S (@jitendrasarda) September 11, 2021
లోయర్ బెర్త్ కోటా..
భారతీయ రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు బుకింగ్‌లో ప్రత్యేక కోటా సెట్ చేయబడింది. దీని కోసం స్లీపర్ క్లాస్, ఏసీ క్లాస్ రెండింటిలోనూ కొంత లోయర్ బెర్త్ రిజర్వ్ చేయబడింది. ఉదాహరణకు, స్లీపర్ క్లాస్‌లోని ఒక్కో కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ క్లాస్‌లలో ఒక్కో కోచ్‌లో మూడు లోయర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌ల కోసం కేటాయించబడ్డాయి.
బుకింగ్ చేసేటప్పుడు లోయర్ బెర్త్‌ని ఎంచుకోండి..
మీరు సీనియర్ సిటిజన్ కాకపోయినా లోయర్ బెర్త్ టిక్కెట్‌ను తీసుకోవాలని అనుకుంటే.. మీరు IRCTC వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసేటప్పుడు లోయర్ బెర్త్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని తరువాత, రైల్వే నిబంధనల ప్రకారం మీకు లోయర్ సీటును కేటాయించవచ్చు. ఈ విధంగా, మీరు ప్రయాణంలో విండో సీట్ కూడా తీసుకుని ఆనందించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..