Womens Day 2022: ఈ ఏడాది ఉమెన్స్ డే థీమ్.. స్థిరమైన రేపటి కోసం.. ‘రేపటి మహిళలు’.. లింగ సమానత్వం సాధించానికి కీలకం..

|

Mar 05, 2022 | 9:46 AM

Womens Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women'S Day) ప్రతి సంవత్సరం మార్చి 8(March 8th)న జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  మంగళవారం(Tuesday)..

Womens Day 2022: ఈ ఏడాది ఉమెన్స్ డే థీమ్.. స్థిరమైన రేపటి కోసం.. రేపటి మహిళలు.. లింగ సమానత్వం సాధించానికి కీలకం..
Womens Day 2022
Follow us on

Womens Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’S Day) ప్రతి సంవత్సరం మార్చి 8(March 8th)న జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  మంగళవారం(Tuesday) జరుపుకోనున్నారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలు జరుపుకోవడం మొదలు పెట్టి వందేళ్లు దాటాయి. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్, చరిత్ర గురించి తెలుసుకుందాం..

2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్:  ఈ ఏడాది మహిళాదినోత్సవం థీమ్..  “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ ” రేపటి మహిళలు”.  ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న  మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ,  విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని UN ఉమెన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పులగురించి.. వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ.. నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించనుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర: ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు  1900వ దశకం ప్రారంభం నుండి నిర్వహించబడుతున్నాయి. 1908లో.. 15,000 మంది మహిళలు తమకు పని గంటలు, మెరుగైన వేతనం,  ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరంలో భారీ ప్రదర్శన చేశారు. దీంతో మహిళల ఈ డిమాండ్లను గుర్తించి అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ అంతటా నిర్వహించారు.  అనంతరం 1911లో.. మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ , స్విట్జర్లాండ్‌ దేశాలు మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిజరిపాయి.

ఇక మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా శాంతి కోసం ప్రచారం చేస్తూ.. రష్యా మహిళలు తమ మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించడానికి అంగీకరించారు. అప్పటి నుండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 న జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1975లో ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా జరుపుకుంది. UN మొదటి వార్షిక థీమ్‌ను 1996లో “గతాన్ని జరుపుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళిక”గా ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చూచించే రంగులు: ఊదా, ఆకుపచ్చ, తెలుపు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని సూచించే రంగులు. ఊదా రంగు న్యాయం , గౌరవాన్ని సూచిస్తుంది, ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది.

Also Read:

తెలంగాణాలో ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఉన్నత మండలి..ఆ విషయంలో నిబంధనలు సడలింపు