Nirma Girl: 1990 లో పుట్టిన పెరిగిన పిల్లలు నిర్మా వాషింగ్ పౌడర్(Nirma Washing Powder) జింగిల్ వింటూ, నిర్మా ప్రకటనను చూస్తూ పెరిగి ఉంటారు. “వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు, నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి” ఈ యాడ్ టెలివిజన్ రంగంలో ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. అప్పట్లో ఈ జింగిల్ యువతి నుంచి వృద్ధుల వరకు అందరి నాలుకపై నిలిచింది. అంతేకాదు ఈ జింగిల్ ప్రకటన విడుదలైన అనంతరం నిర్మా డిటర్జెంట్ విక్రయాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఈ వాణిజ్య ప్రకటనలోని జింగిల్ నేటికీ ప్రజల నోట నానుతూనే ఉంది. ఇన్ని ఏళ్ళు అయినా నిర్మా వాషింగ్ పౌడర్ ప్రకటనను మరచిపోలేదు.
అయితే ఈ జింగిల్ మీదనే కాదు.. నిర్మా ప్యాకెట్‌పై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఆ నిర్మా ప్యాకెట్‌పై సంతోషంగా ఉన్న అమ్మాయి ఫోటో ఉంది. ఆమె ఎవరు, ఆ అమ్మాయి ఫోటో మాత్రమే ఇప్పటి వరకు ఎందుకు నిర్మా ప్యాకెట్ పై కనిపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ అమ్మాయి నిర్మా వాషింగ్ పౌడర్ ను స్థాపించిన యజమాని కుమార్తె.. ఈ అమ్మాయి కారు ప్రమాదంలో మరణించింది. ఈరోజు నిర్మా వాషింగ్ పౌడర్, అమ్మాయి గురించి తెలుసుకుందాం.
కర్సన్‌భాయ్ పటేల్.. గుజరాత్ నివాసి.. 1969లో నిర్మా వాషింగ్ పౌడర్‌ని స్థాపించారు. కర్సన్‌భాయ్ కుమార్తె పేరు నిరుపమ. అయితే తన కుమార్తెను కర్సన్ ప్రేమగా నిర్మా అని పిలిచేవారు. ప్రతి తండ్రిలాగే తన కూతురిని ఎంతో ప్రేమించారు. తన కూతురు ఎదిగి.. సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు, కర్సన్‌భాయ్ పటేల్ కుమార్తె నిర్మా కారు ప్రమాదంలో మరణించింది. తన కూతురు జ్ఞాపకార్థం.. స్థాపించిన కర్సన్‌భాయ్ పటేల్ తన నిర్మా వాషింగ్ పౌడర్ బ్రాండ్‌ను సొంత కూతురిలా చూసుకున్నారు. డోర్ టు డోర్ సర్వీస్‌గా ప్రారంభమైన ఈ బట్టల సబ్బులు ఈ రోజు 20% మార్కెట్ వాటాను, డిటర్జెంట్‌లలో 35% మార్కెట్ వాటాను కలిగి ఉంది.
హృదయాన్ని తాకే నిర్మా కథ:
కర్సన్ భాయ్ పటేల్ 1969లో తన కుటుంబంతో కలిసి గుజరాత్ నివాసి. రసాయన శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. రాష్ట్ర మైనింగ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. ఆయనకు ‘నిరుపమ’ అనే కుమార్తె ఉంది. ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు ‘నిర్మ’ అని పిలిచేవారు. కెమికల్ ఇంజనీరుగా డిగ్రీ పొందిన ఆయన ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. డిటర్జెంట్ పౌడర్ తయారు చేయాలని అనుకున్నారు. తన రీసెర్చ్ ఫలించి 1969లో నిర్మా డిటర్జెంట్ పౌడర్ బయటకు వచ్చింది.
కర్సన్ భాయ్ రోజంతా ఉద్యోగిగా విధులను నిర్వహిస్తూ.. సాయంత్రం ఇంటికి వచ్చి డిటర్జెంట్ తయారు చేశారు. అయితే ఓ రోజు దురదృష్టవశాత్తూ నిరుపమ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదంలో మృతి చెందింది. కర్సన్ భాయ్ , అతని కుటుంబం మొత్తం శోకంతో నిండిపోయింది.ఈ సంఘటనకు వాషింగ్ పౌడర్ నిర్మాకు నాందిగా మారింది.
వాషింగ్ పౌడర్ నిర్మా ఎలా మొదలైందంటే..?
కర్సన్‌భాయ్ పటేల్ తన డిటర్జెంట్‌కు నిర్మా అని పేరు పెట్టారు. ప్యాకేజింగ్‌పై తన కూతురు నిర్మా అందమైన ఫోటోను ముద్రించారు. ఆ సమయంలో మార్కెట్‌లో ఉన్న ఇతర మంచి డిటర్జెంట్‌ల ధర రూ. 13 నుంచి 15 మధ్య ఉంది. అయితే కర్సన్ భాయ్ తన నిర్మా డిటర్జెంట్‌ని వీధిలో సైకిల్ మీద తీసుకుని వెళ్లి.. రూ. 3కి విక్రయించడం ప్రారంభించారు. తక్కువ-ఆదాయం ఉన్న కుటుంబాలకు నిర్మా సబ్బులు మంచి ఎంపికగా మారాయి. దీంతో నిర్మా గురించి ఆ నోటా ఈ నోటా క్రమంగా అహ్మదాబాద్ అంతటా తెలిసింది. అయితే కర్సన్ భాయ్ నిర్మాను కేవలం అహ్మదాబాద్‌లో మాత్రమే కాకుండా భారతదేశం అంతటా అమ్మాలని ప్లాన్ చేశారు. అందుకోసం అద్భుతమైన ప్రణాళిక రచించారు. తన డిటర్జెంట్ కోసం జింగిల్‌ను సృష్టించి టెలివిజన్‌లో ప్రచారం చేశారు.
నిర్మా జర్నీ:
ఈ వాషింగ్ పౌడర్ గురించి వివరిస్తూ.. ఒకొక్క దుకాణాలకు వెళ్ళడానికి కొంతమంది యువకులను ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ మొదలు పెట్టారు. క్రమంగా, నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్లో ఫేమస్ అయింది. కర్సన్ భాయ్ నుంచి డిటర్జెంట్ పౌడర్, సబ్బులను అమ్మకానికి ఏజెన్సీలను తీసుకోవడానికి ముందుకొచ్చారు. అయితే అప్పుగా తీసుకున్న వస్తువులకు తిరిగి బాకీ చెల్లించే సమయంలో సాకులు చెప్పడం మొదలు పెట్టారు. దీంతో నష్టాలు వచ్చాయి. అయినా పట్టు వదలకుండా మళ్ళీ నిర్మాను లాభాల బాట పట్టించారు.
ప్రకటనతో నిర్మా సక్సెస్:
నష్టం వచ్చిన తర్వాత మార్కెట్ లో ఉన్న తన వాషింగ్ పౌడర్ ప్యాకెట్లన్నింటినీ తిరిగి ఇవ్వమని తన సిబ్బందిని కర్సన్ భాయ్ అభ్యర్థించాడు. దీంతో చాలా మంది తమను ఉద్యోగం నుంచి కార్సన్ భాయ్ తీసేశారని చాలామంది భావించారు. అయితే కర్సన్‌భాయ్ మనసులో టెలివిజన్ ద్వారా నిర్మాను మార్కెట్ చేయాలనే ఆలోచన కలిగింది. ఆ తర్వాత, టెలివిజన్‌లో ప్రసారమైన నిర్మా ప్రకటన రాత్రికి రాత్రే ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన జింగిల్.. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి పెదువులపై పలికింది. అప్పటి నుంచి నిర్మా వాషింగ్ పౌడర్ గుజరాత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
సైకిల్‌పై మొదలైన నిర్మా వాషింగ్ పౌడర్ కథ అనతికాలంలోనే మార్కెట్‌లోకి వచ్చింది. త్వరలో భారతదేశంలోని ప్రజలలో ఉత్తమ ఎంపికలలో ఒకటిగా మారింది.
Also Read: