Inspiring Story: ‘టీ’ దుకాణం బంద్ చేసి.. సరికొత్త బిజినెస్‌లో అడుగు పెట్టిన చాయ్‌వాలీ ప్రియాంక

|

May 15, 2022 | 3:09 PM

బీహార్‌ పాట్నాలో ఉమెన్స్‌ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్‌ నడిపిస్తోంది ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు

Inspiring Story: టీ దుకాణం బంద్ చేసి.. సరికొత్త బిజినెస్‌లో అడుగు పెట్టిన చాయ్‌వాలీ ప్రియాంక
Bihar Graduate Chaiwali Pri
Follow us on

Inspiring Story: డిగ్రీ పట్టా పుచ్చుకుని కాళ్లరిగేలా ఉద్యోగం కోసం తిరిగి.. చివరకు చాయ్‌వాలీగా మారిన ప్రియాంక (Chaiwali Priyanaka) గుర్తుంది కదా.. అవును.. ఆ యువత కష్టం.. నిబద్ధత వృధా కాలేదు. ఇంతై.. వటుడింతై అన్నట్లు జీవితంలో దూసుకుపోతోంది. గ్రాడ్యుయేట్‌ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక ఇప్పుడు టీ స్టాల్‌ను(Tea Stall) మూసేసింది. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది.

బీహార్‌ పాట్నాలో ఉమెన్స్‌ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్‌ నడిపిస్తోంది ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్ కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్‌ ఓపెన్‌ చేసింది. ‌ఇందుకు తల్లిదండ్రులు, స్నేహితుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్‌ చాయ్‌వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను మరింత విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్‌ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. మరికొందరు సిబ్బందితో కలిసి ఫుడ్‌ ట్రక్‌ను నడిపిస్తోంది. దాంతో ప్రియాంక కథ మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు సోషల్‌ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..