Viral Video: ఎంత నిద్రనో మరీ.. అయ్యయ్యో పట్టుకోండి.. పట్టుకోండి..! నెట్టింట వీడియో వైరల్

ఓ వ్యక్తి అలసిపోయి మెట్రోలో ఇంటికి వెళుతూ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. గాఢనిద్రలో ఉన్నట్టుండి ఒకేసారి అకస్మాత్తుగా కిందపడిపోతాడు..

Viral Video: ఎంత నిద్రనో మరీ.. అయ్యయ్యో పట్టుకోండి.. పట్టుకోండి..! నెట్టింట వీడియో వైరల్
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 15, 2022 | 11:37 AM

Man Falls Viral Video: ఈ వేసవిలో ఎండలు దంచికొతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. వేడి.. తీవ్రమైన ఉక్కపోత మధ్య చాలామంది పొట్ట కూటి కోసం పనులు చేస్తున్నారు. దీంతో అలసిపోవడం అనేది పరిపాటిగా కనిపిస్తుంది. అయితే.. ఓ వ్యక్తి అలసిపోయి మెట్రోలో ఇంటికి వెళుతూ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అలసిపోయిన ఒక వ్యక్తి పని ముగిసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిద్రపోతూ కనిపించాడు.. అలా నిద్రపోతూ కిందపడిపోతాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘oddly_satisfyiinngg’ అనే పేజీ షేర్ చేసింది. ఈ ఘటన లోకల్ ట్రైన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఎర్రటి టీ షర్టు ధరించిన వ్యక్తి సీటుపై కూర్చొని నిద్రపోతున్నాడు. అయితే.. గాఢనిద్రలో ఉన్నట్టుండి ఒకేసారి అకస్మాత్తుగా కింద పడిపోతాడు. వెంటనే మళ్లీ మేల్కొని కూర్చుంటాడు. అయితే.. నిద్రపోతున్న వ్యక్తి పడిపోయినప్పటికీ.. ట్రైన్‌లో ఉన్నవారెవరూ అతన్ని లేపడానికి ప్రయత్నించలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో చూడండి..

ఈ వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించడంతోపాటు వందలాది మంది లైక్‌ చేశారు. దీంతోపాటు నెటిజన్లు నవ్వుతూ ఎమోజీలను షేర్ చేయడంతోపాటు.. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణాల్లో ఇలాంటివి సహజం అని.. అతని ఏం కాకపోవడం మంచి విషయం అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: సూపర్ ఉమెన్.. నీటిపై అద్భుతమైన స్టంట్లు చేసిన మహిళ.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే..

Rice Water for Hair: బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా.. అందులోని పోషకాలు తెలిస్తే అస్సలు ఒదిలిపెట్టరు..

High BP Control Tips: మందులు లేకుండానే హైబీపీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి.. సింపుల్ టిప్స్ మీకోసమే..