Inspiring Story: సక్సెస్‌కు చిరునామా ఈ బామ్మ.. 79 ఏళ్ల వయసులో లాక్‌డౌన్‌లో బిజినెస్.. మసాలా టీ రెసిపీతో
లాక్ డౌన్ సమయంలో కొందరు ప్రజల అవసరాలను గుర్తించి.. తమ తెలివి తేటలకు పదును పెట్టి.. వ్యాపారాన్ని ప్రారంభించారు.. నేటికీ సక్సెస్ ఫుల్ గా వ్యాపారాన్ని నడిపిస్తూ.. కలలను నెరవేర్చుకోవడానికి వయసు, పరిస్థితులతో సంబంధం లేదంటూ నిరూపించారు.
Inspiring Story: కష్టే ఫలి అన్నారు పెద్దలు.. విజయం సాధించాలి.. తమకంటూ ఓ గుర్తింపు కావాలి అనుకున్న వ్యక్తులు.. వయసుతో, చదువుతో సంబంధం లేకుండా సక్సెస్ ను అందుకుంటారు. తమ కలలను నెరవేర్చుకుంటారు. మలివయసులో కేఎఫ్ సీ వ్యాపారాన్ని మొదలు పెట్టి.. ప్రపంచం వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్ఞాన్ని విస్తరించారు. వ్యాపార చరిత్రలో తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు. నిరుద్యోగులుగా మిగిలారు. అదే సమయంలో మరికొందరు.. లాక్ డౌన్ సమయంలో కొందరు ప్రజల అవసరాలను గుర్తించి.. తమ తెలివి తేటలకు పదును పెట్టి.. వ్యాపారాన్ని ప్రారంభించారు.. నేటికీ సక్సెస్ ఫుల్ గా వ్యాపారాన్ని నడిపిస్తూ.. కలలను నెరవేర్చుకోవడానికి వయసు, పరిస్థితులతో సంబంధం లేదంటూ నిరూపించారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ముంబైకి చెందిన కోకిలా పరేఖ్ 79వ ఏట టీ మసాలా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంట్లో కోకిలా తయారు చేసే రుచికరమైన టీని ప్రశంసిస్తూ స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు.
ఈ మసాలా టీ రెసిపీ కోకిలకు ఆమె తల్లి నుంచి వారసత్వంగా అందించారు. 2020లో.. లాక్‌డౌన్ సమయంలో తన ఫ్యామిలీ రెసిపీతో వ్యాపారంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. తల్లి ఆలోచనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కోకిల కుమారుడు తుషార్ టి మాసాల తయారీకి కావాల్సిన సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. వ్యాపారానికి KT (కోకిల తుషార్) చాయ్ మసాలా అని పేరు పెట్టారు.
KT (కోకిల తుషార్) చాయ్ మసాలా.. తాజా సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడింది. ఈ మసాలాలో కృత్రిమ రంగులు లేదా కృతిమ రుచి లేదు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ KT చాయ్ మసాలా టీ పొడిని భారతదేశం అంతటా సరఫరా చేస్తారు. వినియోగదారుల నుంచి ఆర్డర్ రవాణా చేస్తారు. ప్రస్తుతం, KT చాయ్ మసాలా రోజుకు 500 ఆర్డర్‌లను అందుకుంటుందని కోకిల చెప్పారు. వ్యవస్థాపకురాలు కోకిల ప్రశంసలు అందుకుంటున్నారు.
అయితే తాను మహిళలు గృహిణులుగా మాత్రమే జీవించాలనే ఆలోచనతో తాను పెరిగానని చెప్పారు. తనకు 21 సంవత్సరాల వయస్సులో పెళ్లి అయింది.. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం.. వారి గురించి ఆలోచించడంతోనే తన 60 సంవత్సరాలు సరిపోయాయని.. తెలిపారు. ఇప్పుడు నాకు నచ్చినట్లు జీవిస్తున్నట్లు.. ఇప్పుడు 79 ఏళ్ల వయస్సులో నచ్చిన వ్యాపార రంగంలో అడుగు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కోకిల కు 80 ఏళ్ళు.. ఆమె కృషి,పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్నిహ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..