Telugu News Lifestyle Include these in your diet to get rid of osteoporosis Telugu Lifestyle News
Bone Health: బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? డైట్‌లో వీటిని చేర్చితే ఇక సమస్య పరార్..
వయసు పెరిగే కొద్దీ మనిషి ఎముకలు కూడా బలహీనపడతాయి. కొన్ని సందర్భాల్లో, ఎముకలు పెళుసుగా మారి బలహీనంగా మారతాయి. ఈ పరిస్థితిని 'ఆస్టియోపోరోసిస్' అంటారు. దీని కారణంగా, ఎముకలలో పగుళ్లు కూడా సంభవించవచ్చు. కొన్నిసార్లు ఎముకలు చాలా బలహీనంగా మారవచ్చు.
వయసు పెరిగే కొద్దీ మనిషి ఎముకలు కూడా బలహీనపడతాయి. కొన్ని సందర్భాల్లో, ఎముకలు పెళుసుగా మారి బలహీనంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. దీని కారణంగా, ఎముకలలో పగుళ్లు కూడా సంభవించవచ్చు. కొన్నిసార్లు ఎముకలు చాలా బలహీనంగా మారవచ్చు. కింద పడితే చాలు ఎముకలు విరిగిపోతాయనే భయం ఉంటుంది. ఇది ఎక్కువగా తుంటి, మణికట్టు, వెన్నెముకలో కనిపిస్తుంది. కాల్షియం సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అలాగే, ఇతర పోషకాల లోపం కూడా ఎముకలో బలహీనతకు కారణమవుతుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం.
యాపిల్: రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్య కంట్రోల్ అవుతుంది. నిజానికి, యాపిల్స్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. యాపిల్‌ను పొట్టుతో కలిపి తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నువ్వులు: నువ్వులు ఎముకలను దృఢంగా చేస్తాయినువ్వులను మీ ఆహారంలో చేర్చుకోండి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. నిజానికి నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజూ వేయించిన తెల్ల నువ్వుల గింజలను తీసుకోవచ్చు. వేడి పాలలో కలుపుకుని కూడా తాగవచ్చు.
పైనాపిల్: పైనాపిల్‌లో మాంగనీస్ ఉంటుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. నిజానికి శరీరంలో మాంగనీస్ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆహారం తినే ముందు ఒక చిన్న గిన్నె పైనాపిల్ తినండి. మీరు రోజూ ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ కూడా తాగవచ్చు. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.
చేప నూనె: చేప నూనె ఎముకలను దృఢంగా చేస్తుందిమీరు మాంసాహారులు అయితే, మీరు కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సుల్స్ తీసుకోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం, చేప నూనెలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎముకలు, కండరాలకు బలాన్ని ఇస్తాయి. అయితే చేప నూనెను అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి హానికరం. కాబట్టి తక్కువ పరిమాణంలో తీసుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య పరమైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)