
బలమైన జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా, మన రోగనిరోధక శక్తి, శక్తి, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన జీర్ణవ్యవస్థను ఆ రోగ్యంగా ఉంచుకునేందుకు మన రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. ఈ అల్పాహారాలు మన పేగులకు అనుకూలమైనవిగా మాత్రమే కాకుండా, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలోనూ సహాయపడుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా తోల్పడుతాయి. అయితే నిపుణులు చెబుతున్న ఆ అల్పాహార పదార్థాలు ఏంటని చూసుకుంటే..
ఇది కూడా చదవండి: ఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!
గ్రీకు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి గట్ హెల్త్‌ను కాపాడుకోవడానికి, గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. మీరు వీటిని బెర్రీలతో కలిపి తీసుకోవడం ద్వారా.. ఇవి మీ శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. అంతే కాకుండా చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మీ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఈ మూడింటినీ కలిపి తీసుకోవడం ద్వారా గట్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది.
సౌత్ ఇండియన్ ఫుడ్స్‌లో చాలా మంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందంటే.. ఒకటి దోశా, ఇంకోటి ఇడ్లీ సాంబార్. ఇడ్లీ పులియబెట్టినప్పటికీ, సాంబార్‌లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరానికి అవసమైన పోషకాలను అందిస్తాయి. కొబ్బరి చట్నీలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ అల్పాహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు ఇది మీ పేగు ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక.
ఇది కూడా చదవండి: రాగి పాత్రలో నీరు తాగేటప్పుడు.. ఈ నాలుగు తప్పులు అస్సులు చేయకండి!
ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేవారు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో పోహాను తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీన్ని తయారు చేయడం చాలా సులభం, త్వరగా పూర్తవుతుంది. కూరగాయలు, వేరుశెనగలతో తయారుచేసిన పోహా తేలికైనది, వీటిలో ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ కడుపును కూడా తేలికగా ఉంచుతాయి.
అవకాడోను టోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మన జీర్ణ క్రియను మెరుగుపర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తృణధాన్యాలతో చేసిన టోస్ట్ మీద అవకాడోను తరుముగా వేసుకొని తినడం వల్ల మన శరీరానికి ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇది చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: గుడ్డు vs పనీర్: దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?.. ఏది తినడం బెస్ట్?
మన జీర్ణక్రియను మెరుగుపరిచే మరో బ్రెక్‌ఫాస్ట్ మల్టీగ్రెయిన్ టోస్ట్ విత్ వెజ్జీ ఆమ్లెట్. వెజిటబుల్ ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ టోస్ట్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. ఇది మనకు ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూడడంతో పాటు శరీరానికి శక్తిని ఇస్తుంది, పేగు ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి: మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవట్లేదా? జాగ్రత్త.. ఈ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.