గుండె జబ్బుల నుండి రక్షణకు ఇది ఒక్కటే పరిష్కారం..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం విటమిన్ K గుండె ఆరోగ్యాని కి రక్షణ గా పని చేస్తుందని తేలింది. ఈ విటమిన్ గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె జబ్బులు ఈ రోజుల్లో చాలా మందికి ప్రాణాపాయం కలిగిస్తున్నాయి. దీనికి మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, వాతావరణం వంటివి ప్రధాన కారణాలు. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ K చాలా సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్ లో వచ్చిన తాజా పరిశోధన కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. విటమిన్ K ఎక్కువగా తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
విటమిన్ K వల్ల కలిగే లాభాలు
- రక్తనాళాల ఆరోగ్యం.. ఇది మన శరీరంలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- ధమనుల రక్షణ.. గుండె సమస్యలకు కారణమయ్యే ధమనులు గట్టిపడకుండా కాపాడుతుంది.
- రక్తపోటు అదుపు.. రక్తనాళాల్లో అనవసరమైన ఖనిజాలు పేరుకుపోకుండా చేసి రక్తపోటును తగ్గిస్తుంది.
- రక్తప్రసరణ మెరుగు.. రక్తప్రసరణను సులభతరం చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కానీ విటమిన్ K ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ K ఎక్కడ దొరుకుతుంది..?
- ఆకుకూరలు.. పాలకూర, గోంగూర, మెంతికూర.
- పులియబెట్టిన పదార్థాలు.. పెరుగు, ఊరగాయలు.
- మాంసాహారం.. చేపలు, మాంసం, గుడ్లు.
- పాల పదార్థాలు.. పాలు, చీజ్.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. పెద్దవారికి రోజుకు 70 నుంచి 90 మైక్రోగ్రాముల విటమిన్ K అవసరం. ఇది గుండె ఆరోగ్యానికే కాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో విటమిన్ K ఉండేలా చూసుకోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




