మీ వయసు ఎంత..? ఎన్ని గంటలు మీకు నిద్ర అవసరమో తెలుసా..?
మంచి నిద్ర మన శరీరానికి, మనసుకు ఎంతో అవసరం. నిద్ర సరిగా లేకపోతే డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇది మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతుంది.

Sleeping
మంచి నిద్ర మన శరీరానికి, మనసుకు చాలా అవసరం. సరిగా నిద్రపోకపోతే డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏ పనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేం. అందుకే ప్రతి వయసులోనూ ఎంతసేపు నిద్రపోవాలో తెలుసుకోవడం ముఖ్యం. CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలిపిన వివరాల ప్రకారం.. ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వయసును బట్టి నిద్ర అవసరం
- నవజాత శిశువులు (0 నుంచి 3 నెలలు).. వీరికి రోజుకు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం.
- 4 నుంచి 12 నెలలు.. ఈ వయసు పిల్లలు రోజుకు 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి.
- 1 నుంచి 2 సంవత్సరాలు.. వీరికి 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.
- 3 నుంచి 5 సంవత్సరాలు.. ఈ వయసు పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.
- 6 నుంచి 12 సంవత్సరాలు.. పిల్లలకు రోజుకు 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం.
- 13 నుంచి 17 సంవత్సరాలు.. టీనేజర్లు రోజుకు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.
- 18 నుంచి 60 సంవత్సరాలు.. ఈ వయసు వారు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.
- 61 నుంచి 64 సంవత్సరాలు.. వీరికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.
- 65 ఏళ్లు దాటినవారు.. ఈ వయసు వారికి 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది.
మంచి నిద్ర ఉంటేనే శరీరం చురుగ్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీ వయసు ప్రకారం సరైన నిద్ర ఉండేలా చూసుకోండి.




