Health: అర్థరాత్రి తర్వాత మెలుకువ వస్తుందా.? ఈ సమస్య ఉన్నట్లే..

అర్థరాత్రి నిద్రలో నుంచి మెలుకువ వస్తుంటే అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే.. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఈ సమస్య దేనికి సంకేతం.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Health: అర్థరాత్రి తర్వాత మెలుకువ వస్తుందా.? ఈ సమస్య ఉన్నట్లే..
Health

Updated on: Nov 03, 2024 | 5:19 PM

మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిద్రలేమి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే నిద్రలేమిని చెక్‌ పెట్టేందుకు సూచనలు చేస్తుంటారు. ఇక రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం ఒక సమస్య అయితే.. రాత్రుళ్లు నిద్ర నుంచి ఉన్నపలంగా మెలుకువ వస్తుంటుంది. అయితే రాత్రి ఉన్నపలంగా నిద్ర నుంచి మెలుకువ వస్తుంటే మాత్రం ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

రాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల మధ్య మెలుకవ వస్తుంటే లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా దీర్ఘకాలంగా సమస్య వేధిస్తుంటే మాత్రం వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఇది కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ సమస్యను నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా చెబుతుంటారు. ఇది కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోయే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడితే.. కాలేయం సరిగ్గా పనిచేయదు. లివర్ పనితీరు దెబ్బతినడంతో విషపూరిత వ్యర్థాలు శరీరం లోపల పేరుకుపోతాయి. అయితే ఫ్యాటీ లివర్‌ కారణంగా నిద్ర నుంచి ఎందుకు మెలుకువ వస్తుందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల సమయంలోనే కాలేయం మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అయితే కాలేయంలో కొవ్వు ఎక్కువగా ఉన్నా, పనితీరు దెబ్బతిన్నా.. డీటాక్సిఫై చేయడానికి ఎక్కువ శక్తి అవసర పడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ మనల్ని ఒక్కసారిగా ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా ఒక్కసారిగా మెలుకువ వస్తుంది. ఇది నిద్ర చెడిపోవడానికి కారణమని నిపుణులు అంటున్నారు.

ఊబకాయం, ప్రీ-డయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్‌, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారిలో ఈ ఫ్యాటీ లివర్‌ వ్యాధి వచ్చే అవకశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us