Bad cholesterol: మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందని అర్థం..!

| Edited By: Ram Naramaneni

Jul 08, 2024 | 8:37 PM

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. స్వీట్లు తక్కువగా తినాలి. రాత్రిపూట సరైన నిద్ర తప్పనిసరి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే మానేయాలి. వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.

Bad cholesterol: మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందని అర్థం..!
Bad Cholestero
Follow us on

Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం చాలా ప్రమాదకరం. ఇది అనేక హానికరమైన వ్యాధులకు దారి తీస్తుంది. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభించిందని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తించి వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తించినట్లయితే జీవనశైలి, ఆహార మార్పుల ద్వారా నియంత్రించవచ్చు. కాబట్టి ముఖంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

చెడు కొలెస్ట్రాల్‌ అనేక హానికరమైన వ్యాధులకు దారి తీస్తుంది. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది. ముఖంపై చిన్న బొబ్బలు రావడం ప్రారంభిస్తాయి. చాలా మంది ఈ బొబ్బలు వాటంతట అవే మాయమవుతాయని అనుకుంటారు. ఈ గడ్డలు సాధారణంగా కళ్ల చుట్టూ ఏర్పడతాయి. అలాంటి సంకేతం మీకు కనిపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరిందని సూచిస్తాయి. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే ముఖంపై చర్మం పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.

ముఖంపై వాపుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఈ వాపు చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కావచ్చు. దీంతో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదంటే చర్మం పూర్తిగా పొడిబారుతుంది. ఇలా చర్మం పేలవంగా మారితే చెడు కొలస్ట్రాల్ కారణమని అర్థం.

ఇవి కూడా చదవండి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. స్వీట్లు తక్కువగా తినాలి. రాత్రిపూట సరైన నిద్ర తప్పనిసరి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే మానేయాలి. వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..