చాలా మందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి. జుట్టు సమస్యలకు చుండ్రు కూడా పెద్ద కారణంగా. కొంత మందికి తలలో చుండ్రు ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో నిమ్మరసం వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది మీ జుట్టు నుండి చుండ్రును తొలగించడానికి పని చేస్తుంది. దీని కోసం నిమ్మరసంలో తేనెను కలిపి వాడితే ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం రెండు చెంచాల నిమ్మరసం తీసుకుని, దానికి ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసే ముందు కూడా మీ జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. ఒక గంట తర్వాత మీ జుట్టును బాగా కడగాలి. మీరు ఈ పేస్ట్‌ను వారం రోజుల పాటు క్రమం తప్పకుండా అప్లై చేయాలి. ఇది మీ జుట్టు నుండి చుండ్రును తొలగిస్తుంది. తిరిగి ఏర్పడకుండా చేస్తుంది. ఈ పేస్ట్‌ను 7 రోజులు అప్లై చేయడం వల్ల జుట్టు నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
తలలో దురద ఎక్కువగా నుండి ఉపశమనానికి నిమ్మరసంలో పెరుగును కలిపి వాడితే ప్రయోజనం ఉంటుంద. దీని కోసం నిమ్మరసం తీసుకుని అందులో కావాల్సినంత పెరుగు వేసి బాగా కలపండి. ముందే శుభ్రంగా కడిన జుట్టుకు ఈ మిశ్రమాన్ని పూర్తిగా అప్లై చేయండి. నిమ్మరసంలో పెరుగు లేదా తేనె కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది. మీ జుట్టును సిల్కీగా మార్చడానికి తేనె మరియు పెరుగు బాగా పనిచేస్తాయి. ఈ రెండు అంశాలు చుండ్రును తొలగించి జుట్టును సిల్కీగా మార్చుతాయి. అంతేకాదు పెరుగులో ఉండే పులుపు జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..