ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అన్ని వయసు వారిలో జుట్టు సమస్యలు సాధారణంగా మారాయి. కానీ ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలను, నూనెలను తరచుగా మారుస్తుంటారు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా హెయిర్ అస్సలు తగ్గదు. అందులోనూ కెమికల్ ఆధారిత ఉత్పత్తులు వాడితే జుట్టు మరింత దెబ్బతింటుంది. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అయితే మీరు కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే మాత్రం జుట్టు అస్సలు రాలదు అంటున్నారు నిపుణులు. దాంతో పాటుగా మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
జుట్టు రాలడం సమస్య నుండి బయటపడాలంటే, జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలంటే తలస్నానం చేసే విషయంలో కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. జుట్టు, స్కాల్ప్ నుండి సహజ నూనెలను తొలగించకుండా ఉండటానికి సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించి మీ జుట్టును వాష్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
రోజూ తలస్నానం చేయడం వల్ల తల పొడిబారుతుంది. దీని వల్ల స్కాల్ప్ లోని సహజసిద్ధమైన ఆయిల్ నాశనమై జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనిని నివారించాలంటే వారానికి 2-3 సార్లు తల స్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం చేసేటప్పుడు చాలా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. ఇది జుట్టు రాలడానికి కారణం కావచ్చు. తలస్నానం చేసేటప్పుడు జుట్టును పూర్తిగా శుభ్రం చేసుకోకపోతే షాంపూలోని రసాయనాలు అలాగే ఉండి జుట్టుకు హాని కలిగిస్తాయి. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు.
నూనె రాసుకోకుండా జుట్టును వాష్ చేసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. దీన్ని నివారించడానికి, తలస్నానం చేసే ముందు మీ జుట్టుకు నూనె అప్లై చేసుకోవటం మంచిది. కనీసం వారానికి ఒకసారైనా జుట్టుకు బాగా నూనె రాసి, తేలికగా మసాజ్ చేసి తలస్నానం చేయాలి. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. తలస్నానం చేసే ముందు, తాజా కలబంద జెల్‌ను జుట్టు చివర వరకు అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచి జుట్టును కడగాలి. ఇది జుట్టు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..