Mental Health: మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని వర్రీ అవుతున్నారా? నచ్చినట్లు ఉండటమే సక్సెస్‌ మంత్ర..

|

Oct 09, 2024 | 1:51 PM

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, కోరుకున్నట్లు జీవించాలని అనుకుంటారు. కానీ మన చుట్టూ ఉన్నవారి వల్ల అది సాధ్యం కాదు. నవ్వినా.. నవ్వకున్నా.. మాట్లాడినా.. మాట్లాడకున్నా.. ఇలా మనం ఏ పని చేసినా మన గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్లు ప్రతీ చోట దర్శనమిస్తారు. ఇలాంటి వారి వల్ల మనసుకు తీవ్రంగా బాధ కలుగుతుంది..

Mental Health: మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని వర్రీ అవుతున్నారా? నచ్చినట్లు ఉండటమే సక్సెస్‌ మంత్ర..
Mental Health
Follow us on

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, కోరుకున్నట్లు జీవించాలని అనుకుంటారు. కానీ మన చుట్టూ ఉన్నవారి వల్ల అది సాధ్యం కాదు. నవ్వినా.. నవ్వకున్నా.. మాట్లాడినా.. మాట్లాడకున్నా.. ఇలా మనం ఏ పని చేసినా మన గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్లు ప్రతీ చోట దర్శనమిస్తారు. ఇలాంటి వారి వల్ల మనసుకు తీవ్రంగా బాధ కలుగుతుంది. కొన్నాళ్లకు వారి నుంచి దూరంగా పారిపోవడం ప్రారంభిస్తాం. ఇలా జరగకుండా ఉండాలంటే..ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. వారి మాటలకు శ్రద్ధ చూపకుండా మనకు మనం ఎలా నిజాయితీగా ఎలా ఉండగలమో నిరూపించాలి. అందుకు ఇక్కడ కొన్ని మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జీవితంలో ఏది ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి

మీ జీవితంలో మీకు ఏది కావాలి, ఏది వద్దు అనే దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వివిధ ప్రాధాన్యతలు ఉంటాయి. కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారనే దాని గురించి మీకు క్లారిటీ ఉండాలి. ఇతరుల అభిప్రాయాలకు, వారి ఊసుపోని మాటలను వినడం మానేసి, మీ స్వంత ఆలోచనలతో కొనసాగడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల అభిప్రాయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడం అంత అవసరం లేదు.

ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోవాలి

కొన్నిసార్లు మన నిర్ణయాల గురించి ఇతరుల అభిప్రాయం లేదా సలహాలను అడుగుతుంటాం. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనా విధానం భిన్నంగా ఉండటం వల్ల వారు ఇచ్చే సలహాలు సరైనవి కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏమి చేయాలో స్పష్టమైన చిత్రాన్ని కలిగి ఉండి, దాన్ని ఫాలో అయిపోవాలి.

ఇవి కూడా చదవండి

ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది మీకు ముఖ్యం కాదు

మన చుట్టూ ఉన్నవారు మనం ఏమి చెప్పినా.. చెప్పకున్నా.. మీ గురించి నిత్యం ఏదో ఒకటి అనుకుంటారు. ఇలా వారు ఏమనుకుంటున్నారో అనే దాని గురించి మీరు ఆలోచించడం మానేయాలి. ఇతరుల ఆలోచనలను మార్చలేం. వాటిని నియంత్రించలేం కూడా. ఈ వాస్తవాన్ని గ్రహిస్తే ఇతరు కామెంట్లకు ప్రాధ్యాన్యం ఇవ్వడం మానేస్తారు. ఎల్లప్పుడూ చురుకుగా ఉండటం, ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం ద్వారా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండవచ్చు.

ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా.. పర్‌ఫెక్ట్‌గా.. ఉండలేరనే విషయాన్ని గుర్తించాలి

ఈ ప్రపంచంలో పరిపూర్ణ వ్యక్తి ఎవరూ లేరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా పరిపూర్ణులు కాదు. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడితే.. ప్రతిదానిలో పరిపూర్ణతను లక్ష్యంగా పెట్టుకుని చేస్తే సాధ్యం అవుతుంది. పనిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, దాన్ని సరిదిద్దుకుని ముందుకు సాగడం ముఖ్యం. వారు అనే మాటలను మనసుకు తీసుకోకూడదు.

మీ దృక్కోణం సరైనదైతే చాలు..

చాలా మంది వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. తదనుగుణంగా ప్రవర్తిస్తారు. కానీ మీ జీవిత లక్ష్యాలు మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కాబట్టి మీ అభిప్రాయాలు, నిర్ణయాలు సరైనవి అయితే.. ఇతరుల ఆలోచనా విధానాలు తప్పు అనే విషయం గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు.

మీ నిర్ణయాలపై నమ్మకం ఉంచాలి

ఇతరులను సంతోషపెట్టడానికి మీరు ఏమీ చేసినా అది చెడు ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి మీ ఆలోచనా విధానం, నిర్ణయం తీసుకునే విధానంపై విశ్వాసం పెట్టడం ముఖ్యం. మీ లక్ష్యాన్ని సులభంగా చేరుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ నిర్ణయాన్ని ఇతరులతో చర్చించవద్దు. దీంతో వారి పనికిమాలిన అభిప్రాయాలు వినే అవకాశం ఉండదు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.