సమ్మర్‌ లో సాక్సుల నుంచి వచ్చే దర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?

వేసవిలో అధిక చెమట కారణంగా సాక్స్‌ నుంచి దుర్వాసన రావడం చాలా మందికి సాధారణ సమస్య. అయితే కొన్ని సరళమైన మార్గాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాటన్ సాక్స్ వాడడం, టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం, సాక్స్‌ను శుభ్రంగా ఉతికి ఆరబెట్టడం వంటివి మంచి పరిష్కారాలు.

సమ్మర్‌ లో సాక్సుల నుంచి వచ్చే దర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?
Summer Hacks For Smelly Socks

Updated on: May 04, 2025 | 9:33 PM

వేసవిలో అధిక చెమట వల్ల సాక్స్ నుంచి దుర్వాసన రావడం సాధారణం. దీన్ని నివారించేందుకు కాటన్ లేదా ఉన్నితో చేసిన సాక్స్ వాడాలి. ప్రతి సారి వాడిన తర్వాత సాక్స్ బాగా ఉతికి ఆరబెట్టాలి. లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ జోడించి ఉతికితే మంచి వాసన వస్తుంది. అలాగే పాదాలను శుభ్రంగా ఉంచటం, టాల్కమ్ పౌడర్ వాడటం కూడా ముఖ్యం.

వేసవిలో పిల్లలు సెలవుల వల్ల సాక్స్ అవసరం తక్కువగా ఉంటుంది. కానీ ఆఫీస్‌కు వెళ్లే వారు రోజంతా సాక్స్ ధరిస్తారు. ఎక్కువసేపు సాక్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే అవకాశం దొరికినప్పుడు బూట్లు తీసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. వేసవిలో తల నుండి కాళ్లవరకు చెమట ఎక్కువగా వస్తుంది. దీని ప్రభావంతో సాక్స్ తడిగా మారి దుర్వాసన వస్తుంది. ఈ పరిస్థితిలో బహిరంగ ప్రదేశాల్లో బూట్లు తీయడం ఇబ్బందిగా అనిపించొచ్చు.

సాక్స్ ఉతుకుతుంటే వాటిలో కొన్ని చుక్కల లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ వేసుకోవచ్చు. వీటి వాసన బాగుంటుంది. యాంటీ బాక్టీరియా లక్షణాలతో పాదాలకు రక్షణ కలుగుతుంది.

సాక్స్ కొంటే కాటన్ లేదా ఉన్నితో చేసినవి కొనాలి. ఇవి గాలి ప్రవాహాన్ని అనుమతిస్తాయి. చెమటను పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. వేసవి కాలంలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ఏ సీజన్ అయినా.. ఒకసారి వాడిన సాక్స్ తిరిగి వాడకూడదు. పాదాలకు ఎక్కువ చెమట పట్టే వారు రోజుకు రెండు జతల సాక్స్ వాడవచ్చు. ఇలా చేస్తే బాక్టీరియా పెరగకుండా ఉంటుంది.

ఉతికిన సాక్స్ తడి ఉండకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తడి సాక్స్ వల్ల దుర్వాసనతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. అందువల్ల వాటిని పూర్తిగా ఆరనిచ్చే వరకు వాడకూడదు.

సాక్స్ వేసే ముందు పాదాలను బాగా వాష్ చేసుకొని ఆరనివ్వాలి. ఆపై టాల్కమ్ పౌడర్ వాడాలి. ఇది చెమట తగ్గించడంలో సహాయపడుతుంది.

చెమట వాసన నియంత్రించేందుకు పెర్ఫ్యూమ్ వాడొచ్చు. సాక్స్‌పై కొంత పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటి చిట్కాలను పాటిస్తే వేసవిలో సాక్స్ దుర్వాసనను సులభంగా నియంత్రించవచ్చు.