AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyeglass: మీ లెన్స్‌లపై గీతలు ఉన్నాయా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో క్షణాల్లో తొలగించండి

ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీది డిజిటైలజేషన్ అయిపోయింది. ఏ ఉద్యోగమైన కంప్యూటర్స్‌ ముందు కూర్చొనే చేయాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ సేపు స్క్రీన్‌ చూడడం వల్ల చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు కళ్లజోడును ఉపయోగిస్తున్నారు. వీరే కాకుండా సైట్‌ ఉన్నవారు, తలనొప్పి ఉన్నవారు కూడా కళ్లజోడును ఉపయోగిస్తారు. అయితే మన కళ్ళద్దాలపై పడే చిన్న గీతలు కొన్నిసార్లు మన దృష్టిని అస్పష్టం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కొత్తవి కొనకుండా వాటినే కొన్ని సింపుల్‌ టిప్స్‌తో క్లిన్ చేసుకోవచ్చు అదెలానో తెలుసుకుందాం పదండి.

Eyeglass: మీ లెన్స్‌లపై గీతలు ఉన్నాయా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో క్షణాల్లో తొలగించండి
Eyeglass Stains
Anand T
|

Updated on: Sep 28, 2025 | 5:43 PM

Share

కళ్లజోడు లెన్స్‌లపై పడే చిన్న గీతలు కొన్ని సార్లు మీ దృష్టిని అస్పష్టం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు తరచుగా కొత్త అద్దాలు కొనాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు కొత్త అద్దాలు కొనడానికి లేదా లేన్స్‌ మార్చుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ముందు మేము చెప్పి కొన్ని చిట్కాల గురించి తెలుసుకోండి. ఈ సింపుట్‌ టిప్స్‌తో మీరు మీ ఇంట్లోనే మీ లెన్స్‌పై ఉన్న గీతలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.

ఇంట్లో కళ్లజోడును శుభ్రం చేసుకునే చిట్కాలు

టూత్‌పేస్ట్: లెన్స్‌ క్లిన్ చేసేందుకు టూత్‌పేస్ట్ అనేది సులభమైన, అత్యంత ప్రజాదరణ పొందిన పరిష్కారాలలో ఒకటి. దీని కోసం మీరు శుభ్రమైన కాటన్ తీసుకొని దానికి కొద్దిగా టూత్‌పేస్ట్ యాడ్‌ చేసి గీతలు పడిన ప్రాంతాన్ని గుడ్రంగా సున్నితంగా రుద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ప్రెస్‌ చేయకండి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ గీతలు పడే అవకాశం ఉంది. దాదాపు 15 నుండి 20 సెకన్ల పాటు రుద్దిన తర్వాత, గ్లాసులను నీటితో శుభ్రం చేసి, పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో తుడవండి. దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తొలిగిపోతాయి

బేకింగ్ సోడా పేస్ట్: మరకలను తొలగించేందుకు బేకింగ్‌ సొడా కూడా మంచి ఎంపిక.. మీరు మొదటగా ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నీటిని కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను గీతలపై అప్లై చేసి పైన చెప్పినట్లుగా సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత, గ్లాసులను శుభ్రమైన నీటితో శుభ్రం చేసి, పొడి గుడ్డతో తుడవండి.దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తొలిగిపోతాయి

కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీ: కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీ గీతలను పూర్తిగా తొలగించలేవు. కానీ అవి తాత్కాలికంగా వాటిని తొలగించడంలో సహాయపడతాయి. స్క్రాచ్‌పై కారు వ్యాక్స్ లేదా పెట్రోలియం జెల్లీని పలుచగా పూయండి. తర్వాత మృదువైన వస్త్రంతో దాన్ని క్లీన్ చేయండి. దీంతో లెన్స్‌పై ఉన్న మరకలు తాత్కాలికంగా తొలిగిపోతాయి

కొబ్బరి నూనె: మీ అద్దాలకు ప్లాస్టిక్ లెన్స్‌లు ఉంటే, కొబ్బరి నూనె మంచి ఎంపిక. స్క్రాచ్‌పై కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి, కాటన్ బాల్ ఉపయోగించి మెల్లగా రుద్దండి. ఇది స్క్రాచ్ తక్కువగా కనిపించడానికి, లెన్స్‌లను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..