నారింజ తొక్కతీయకుండానే తియ్యగా ఉందో లేదో చూడొచ్చు..? డబ్బు ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

నారిజం పండ్ల విషయంలో ఎప్పుడూ ఒక సమస్య తలెత్తుతుంది. ఏ నారింజ తియ్యగా ఉంది.. ? ఏది పుల్లగా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే.. బయటి నుండి ఫ్రెష్‌గా, బాగా పండినట్టుగా ఉంటాయి. కానీ, ఇంటికి తీసుకువచ్చి తొక్క తీసినప్పుడు దాని పుల్లటి రుచి నోట్లో పెట్టుకోవలంటే కూడా భయపడేలా చేస్తుంది. కానీ, నారింజ తొక్క తీయకుండా దాని రుచిని గుర్తించవచ్చని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం...

నారింజ తొక్కతీయకుండానే తియ్యగా ఉందో లేదో చూడొచ్చు..? డబ్బు ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Sweet And Juicy Orange

Updated on: Dec 23, 2025 | 11:33 AM

శీతాకాలంలో సీజనల్‌ పండ్లతో పాటు నారింజ పండ్లు కూడా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. తీపి, పుల్లని, జ్యుసి నారింజలు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, అలసట నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అయితే, నారిజం పండ్ల విషయంలో ఎప్పుడూ ఒక సమస్య తలెత్తుతుంది. ఏ నారింజ తియ్యగా ఉంది.. ? ఏది పుల్లగా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే.. బయటి నుండి ఫ్రెష్‌గా, బాగా పండినట్టుగా ఉంటాయి. కానీ, ఇంటికి తీసుకువచ్చి తొక్క తీసినప్పుడు దాని పుల్లటి రుచి నోట్లో పెట్టుకోవలంటే కూడా భయపడేలా చేస్తుంది. కానీ, నారింజ తొక్క తీయకుండా దాని రుచిని గుర్తించవచ్చని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం…

అవును, కొన్ని సింపుల్‌ టిప్స్‌తో నారింజ పండు తియ్యగా ఉందో లేదో మీరు దానిని తొక్క తీయకుండానే తెలుసుకోవచ్చు. దీనికి ప్రత్యేక యంత్రం అవసరం లేదు. పండును తొక్కతీయాల్సిన, కోయాల్సిన అవసరం కూడా లేదు. నారింజ పండు తియ్యగా ఉందో లేదో ఎలా గుర్తించాలి?

1. బరువు ద్వారా గుర్తించండి:

ఇవి కూడా చదవండి

సులభమైన మార్గం ఏమిటంటే ఒక నారింజ పండును తీసుకొని దాని బరువును పరిశీలించండి. ఒకే పరిమాణంలో ఉన్న రెండు నారింజ పండ్లను తీసుకోండి. బరువైన నారింజ సాధారణంగా రసం ఎక్కువగా, తియ్యగా ఉంటుంది. తేలికైన నారింజ పొడిగా, పుల్లగా ఉంటుంది.

2. పై తొక్క ఆకృతిని బట్టి కూడా రుచిలో తేడా:

తియ్యటి నారింజ పండ్లు సాధారణంగా సన్నని, కొద్దిగా మృదువైన తొక్కను కలిగి ఉంటాయి. తొక్క చాలా మందంగా, గట్టిగా లేదా గరుకుగా ఉంటే, నారింజ పుల్లగా ఉండవచ్చు. ఉబ్బిన లేదా అతిగా గరుకుగా ఉండే నారింజ పండ్లను తీసుకోవద్దు.

3. రంగు ద్వారా రుచి తెలుసుకోవచ్చు:

చాలా ప్రకాశవంతంగా లేదా ఆకుపచ్చగా ఉండే నారింజ తప్పనిసరిగా తియగా ఉండకపోవచ్చు. బాగా పండిన పండ్లు సాధారణంగా లేత నారింజ లేదంటే పసుపు రంగులో ఉంటుంది. ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉన్న నారింజలు పండవి. ఇవి కచ్చగా ఉండి రుచికి పుల్లగా ఉంటాయి.

4. నొక్కి చూడొచ్చు:

నారింజను మెల్లగా కాస్త నొక్కి చూడటం ద్వారా అది కొద్దిగా మెత్తగా ఒత్తుకు పోతుంది. దాని ఆకారానికి తిరిగి వస్తే, అది తాజాగా, జ్యుసిగా ఉంటుంది. చాలా గట్టిగా లేదా చాలా మృదువుగా ఉండే నారింజ రుచిలో మీరు ఆశించిన టేస్ట్‌ ఉండకపోవచ్చు.

5. సువాసన ద్వారా కూడా తెలుస్తుంది :

తియ్యటి నారింజ పండ్లు తేలికపాటి, తాజా, సిట్రస్ వాసన కలిగి ఉంటాయి. ఒక నారింజ పండుకు విలక్షణమైన వాసన లేకపోతే లేదా వింత వాసన వస్తే, దానిని తినకుండా ఉండండి.

6. కొమ్మ కూడా సంకేతాలను ఇస్తుంది:
నారింజ పండులో కొమ్మ ఉన్న భాగం కొద్దిగా లోపలికి నొక్కి స్పష్టంగా కనిపిస్తే, నారింజ పండినది. తియ్యగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సరైన నారింజను ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?:

నారింజను సరిగా చూసి తీసుకోకపోతే, రుచి చెడిపోవడమే కాకుండా ఇక మీద కూడా వాటిని తినడం మానేస్తారు. సరైన నారింజను తీసుకోవడం వల్ల మీకు గొప్ప పోషకాహారం, ఉన్నతమైన రుచి, డబ్బుకు ప్రతిఫలం లభిస్తుంది.

ఇప్పుడు మీరు నారింజ పండ్లు కొనేటపుడు భయపడాల్సిన అవసరం ఉండదు. తదుపరిసారి మీరు మార్కెట్‌కు వెళ్ళినప్పుడు, దాన్ని తీసుకొని దాని బరువును గమనించండి.. తొక్క, రంగు, వాసనను చెక్‌ చేయండి. నారింజ పండు తియ్యగా ఉందో లేదో తొక్క తీయకుండానే మీరు చాలా వరకు చెప్పగలరు.