
శీతాకాలం రావడంతో చాలా మంది ఇంట్లో మొక్కజొన్న రొట్టెలు, ఆవాల ఆకుకూరలు ఎక్కువగా వండుతుంటారు. కానీ చాలా మందికి జొన్న, మొక్కజొన్న రోటీ తయారు చేయడం పెద్ద సవాలుతో కూడుకున్న పని అవుతుంది. ఎందుకంటే.. ఈ పిండి విరిగిపోతుంది. రోటీ పాన్‌లోకి చేరేలోపు ముక్కలవుతుంది. అది అస్సలు గుండ్రంగా ఉండదు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఈ జొన్న, మొక్కజొన్న రొట్టెల జోలికి పొవద్దు అనుకుంటారు. దాంతో ఈ పిండిలో గోధుమ, శనగ పిండిని మొక్కజొన్న పిండితో కలుపుతారు. దీని వల్ల అది అంత రుచిగా ఉండదు. కానీ, ఎలాంటి ఇతర పిండి కలపకుండా కేవలం మొక్కజొన్న పిండితోనే పర్ఫెక్ట్ రొటీలు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం…
మొక్కజొన్న రొట్టె ఎలా తయారు చేయాలి?
మొక్కజొన్న పిండి గోధుమ పిండిలా మెత్తగా ఉండదు. కాబట్టి. పిండిని నీళ్లతో తడుపుతున్నప్పుడు వేడి నీటిని తీసుకోవాలి. వేడి నీళ్లతో జొన్న పిండిని తడుపుకోవడం వల్ల రోటీలు తయారుచేసేటప్పుడు విరగకుండా పిండి మృదువుగా తయారవుతుంది. వేడి నీరు పిండికి కొంచెం జిగటతనాన్ని కలిగిస్తుంది. ఇది రోటీలను ఆకృతి చేయడం సులభం చేస్తుంది.
ఇకపోతే, గోధుమ పిండిని తడిపిన తరువాత 10–15 నిమిషాలు అలా పక్కన పెడుతుంటారు. కానీ, ఈ నియమం మొక్కజొన్న పిండికి వర్తించదు. మొక్కజొన్న పిండిని వేడి నీళ్లతో పిసికిన వెంటనే రోటీలు తయారు చేయాలి. అలాగే ఉంచితే, పిండి తడి ఆరిపోతుంది. దీనివల్ల రోటీలు సులభంగా విరిగిపోతాయి. కాబట్టి, అవసరమైన మొత్తంలో మాత్రమే పిండిని తీసుకొని వెంటనే మీకు కావాల్సినన్నీ రొట్టెలు తయారు చేసుకోవాలి.
ఈ కార్న్ బ్రెడ్ తయారీ చాలా కష్టం.. ఎందుకంటే ఈ పిండి గోధుమ పిండిలా అంటుకుని ఉండదు.. రోటీ చేస్తున్నప్పుడు సాగదు. ఊరికే విరిగిపోతుంది. కాబట్టి, మీ చేతులకు కొద్దిగా నీళ్లను రాసుకుని, పిండిని కావాల్సిన సైజులో ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు, దానిని ప్లాస్టిక్ షీట్ లేదా లైట్‌గా నూనె రాసిన కాగితంపై వత్తుకోవాలి. దానిని సున్నితంగా గుండ్రని ఆకారంలో చేసుకోవాలి. రోటీ రెడీ అయ్యాక దానిని నేరుగా పాన్ మీద తిప్పేయండి. ఇలా చేస్తే రోటీ విరిగిపోకుండా ఉంటుంది.
ఈ మూడు టిప్స్‌తో మీరు ఎక్కువ శ్రమ లేకుండా ఒకేసారి గుండ్రని, మృదువైన మొక్కజొన్న రొట్టెలను తయారు చేయగలుగుతారు. కాబట్టి, మీరు సారి కార్న్ బ్రెడ్ తయారుచేసేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ తప్పక ట్రై చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.