చలికాలంలో ఈ పండ్లు తినకూడదు.. తింటే ఆ సమస్యలు తప్పవు!
చలికాలం వచ్చిందంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్నిరకాల ఆహారాలు తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వలన అవి తలనొప్పి, జలుబు,దగ్గు వంటి సమస్యలకు కారణం అవుతుంది. కాగా, శీతాకాలంలో ఎలాంటి పండ్లు తీసుకోకూడదో, అవి చూద్దాం.
Updated on: Dec 02, 2025 | 7:06 PM

పైనాపిల్ : పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దీనిని శీతాకాలంలో తినడం మంచిది కాదంట. దీనిని చలికాలంలో తినడం వలన ఇది గొంతు నొప్పి, అలర్జీ వంటి సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే చలికాలంలో దీనిని అస్సలే తినకూడదంట.

అరటి : అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక అరటి పండు తినడం వలన ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని చలికాలంలో ఎక్కువగా తినడం వలన ఇది కఫం ఉత్పత్తిని పెంచుతుందంట. అందువలన దీనిని శీతాకాలంలో అస్సలే తినకూడదంట.

ద్రాక్ష : నల్ల ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీనీ దీనిని శీతాకాలంలో తినడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయంట. చలికాలంలో దీనిని తినడం వలన జలుబు, దగ్గు, వంటి సమస్యలకు కారణం అవ్వడమే కాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుందంట.

పుచ్చకాయ : పుచ్చకాయను శీతాకాలంలో తినడం వలన ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా దీనిని చలికాలంలో దీనిని తినడం వలన జీర్ణ సమస్యలు అధికం అవుతాయంట. అందువలన శీతాకాలంలో ఇది అస్సలే తినకూడదంట.