AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్ పౌడర్.. ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

పిల్లల ఆరోగ్యం కోసం తప్పకుండా వారి డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఉండాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, మెదడు అభివృద్ధికి కూడా ఉపయోగపడుతాయి. అయితే చాలా మంది పిల్లలు వాటిని డైరెక్ట్‌గా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాగే కొందరు పాలు తాగడానికి కూడా అసలే ఇంట్రస్ట్ చూపరు, అటువంటి సమయంలో పాలల్లో డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి తాగించడం వలన ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా రెడీ చేయాలో చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 02, 2025 | 6:04 PM

Share

1 / 5
డ్రై ఫ్రూట్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బాదం ఒక కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పిస్తాపప్పులు 1/2 కప్పు, వాల్ నట్స్ 1/2 కప్పు, ఏలకులు 4 టు 5 కుంకుమ పువ్వు చిటికెడు.

2 / 5
తయారీ విధానం : ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పులు, వాల్ నట్స్ అన్ని ఎండినవో చూసుకోవాలి. తర్వాత వాటిని ఒక పాన్ పెట్టి, వాటిపై దోరగా వేయించుకోవాలి. తర్వాత అవి చల్లబడేందుకు పదనిమిషాలు వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని జార్ లో వేసి మొత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు, ఏలకులు వేసి రుబ్బుకోవాలి. అంతే పిల్లలకు బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ.

3 / 5
ఇక ఈ పౌడర్‌ను గ్లాస్ వేడి పాలల్లో  ఒకట నుంచి రెండు టీ స్పూన్స్ వేసి పౌడర్ మొత్తం కలిసేలా స్పూన్‌తో కలపాలి తర్వాత ఆ పాలను పిల్లలకు అందించాలి. ఇది పిల్లలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

4 / 5
ప్రతి రోజూ మీ పిల్లలు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కలిపిన పాలు తాగడం వలన జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఇది మీ పిల్లలను రక్షిస్తుంది.

5 / 5