
వాషింగ్ మెషిన్ క్లీనింగ్ అనగానే చాలా మంది ఒక డౌట్ వస్తుంది. వాషింగ్ మెషన్ లో బట్టలు ఉతికేటప్పుడు అది వాటర్ తోనే నడుస్తుంది. అప్పుడు అదంతకదే క్లీన్ అవుతుంది కదా..మీళ్లీ మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటని.. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అది తడిగా ఉండడం, లోపల సబ్బు పేరుకుపోతుంది. అవి ఫంగస్ గా మారి బట్టలు వేసినప్పుడు స్మెల్ వస్తుంది. అంతేకాదు దీని వల్ల , వాటర్, కరెంటు కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ ను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి.
వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేయాలి
మీరు వాషింగ్ మెషిన్ క్లీన్ చేయాలనుకుంటే ముందుగా స్వీచ్ నుంచి బోర్డు నుంచి తీసేయండి. తర్వాత మెషిన్ వెనకసైడ్ ఉండే వాటర్ ట్యాప్ ను క్లోజ్ చేయండి. ఆ తర్వాత మెషిన్ లో హాటర్ వాటర్ సెట్ చేసి .. డిటర్జెంట్ బాక్స్ లో 2 కప్పుల వెనిగర్ వేసి మళ్లీ మిషన్ ఆన్ చేయండి. అది రన్ అవుతున్న సమయంలో వాటర్ ఉన్న వెనిగర్ మెషిన్ లోపల పేరుకు పోయిన జిడ్డును, బ్యాక్టీరియాను చంపేసి, క్లీన్ చేస్తుంది.
టాప్ లోడ్ , ఫ్రంట్ లోడ్
ఒక వేళ మీరు యూజ్ చేసేది టాప్ లోడ్ మెషీన్ అయితే, సైకిల్ కాసేపు ఆపి, వాటర్ లో అర కప్పు బేకింగ్ సోడా వేసి కొద్దిసేపు నాననివ్వండి. ఒక వేళ మీది ఫ్రంట్ లోడ్ మెషిన్ అయితే, డైరెక్ట్ గా డ్రమ్‌లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి షార్ట్ వాష్ లో ఉంచండి. దీంతో మెషన్ లోని స్మెల్ తొలగిపోతుంది.
డిటర్జెంట్ బాక్స్ క్లీనింగ్
డిటర్జెంట్ బాక్స్ ను పూర్తిగా బయటకు తీసి క్లీన్ చేయాలి. దాన్ని మీరు కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే అది బయటకు వస్తుంది. దాన్ని గోరువెచ్చని సబ్బు నీళ్లలో ఓ 20 నిమిషాలు నానబెట్టి తర్వాత ఒక బ్రష్ తీసుకొని పూర్తిగా క్లీన్ చేయండి.ఆ తర్వాత దాన్ని కాటన్ క్లాత్ తో బాగా తుడి మళ్లీ ఫిక్స్ చేయండి.
రబ్బర్ సీల్ క్లీనింగ్
ఫ్రంట్ లోడ్ మెషీన్ త్వరగా చెడిపోవడానికి ప్రధాన కారణం దాని డోర్ రబ్బర్ గ్యాస్కెట్ దెబ్బతినడం.ఇది దెబ్బతింటే మడతల్లో వాటర్ ఆగిపోయి ఫంగస్ ఏర్పడుతుంది. అందుకే దీన్ని వెనిగర్ కలిపిన వాటర్ తీసుకొని క్లాత్ తో రబ్బర్ సందుల్లో ఉండే మురికిని క్లీన్ చేయండి.తర్వాత పొడి బట్టతో రబ్బర్ నీరు లేకుండా తుడిచి మళ్లీ ఫిక్స్ చేయండి.
డ్రైన్ పంప్ ఫిల్టర్వాషింగ్
మెషీన్ కింద భాగంలో ముందు వైపు చిన్న బాక్స్‌లా ఉండే డ్రైన్ పంప్ ఫిల్టర్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఇందులో బట్టల నుంచి ఊడిపోయిన గుండీలు, దారం పోగులు, అలాగే పాకెట్లో ఉండే ఏవైనా వస్తువులు ఇందులో పడిపోతాయి. ఆ బాక్స్ బయటకు తీసి వాటిని మొత్తం తొలగించింది. ఫిల్టర్ ను క్లీన్ చేసి మళ్లీ ఫిక్స్ చేయండి.
వాషింగ్ మెషీన్ చెడిపోకుండా ఎలా వాడాలి.
చాలా మంది వాషింగ్ మెషిన్ సరైన విధానంలో వాడపోవడం వల్ల అది త్వరగా పాడవుతుంది. కాబట్టి దాన్ని సరైన విధానంలో ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. మీరు దాని కెపాసిటీకి మించి ఎప్పుడు బట్టలు వేయకండి. ఇలా చేయడం ద్వారా మెషిన్ పై ఎక్కువ లోడ్ పడి అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. బట్టలు క్లీన్ చేసిన వెంటనే డోర్ వేయొద్దు. కాసేపు అలానే ఓపెన్ చేసి ఉంచి తడి ఆరిన తర్వాత కోజ్ చేయండి.
మెకానిక్‌ను ఎప్పుడు పిలవాలి?
మీ వాషింగ్ మెషిన్ ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే.. మీ సొంత తెలివితేటలు అస్సలు ఉపయోగించొద్దు. వెంటనే టెక్నీషియన్‌ను కు కాల్ చేసి రిపేర్ చేయించుకోండి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వాడే వాషింగ్ మెషిన్ లైఫ్ పెంచుకోవడంతో పాటు త్వరగా చెడిపోకుండా చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.