Toothache: భరించలేని పంటి నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం

పంటి నొప్పి వస్తే ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నొప్పి భరించలేనంతగా ఉంటుంది.

Toothache: భరించలేని పంటి నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
Toothache

Updated on: Jul 24, 2022 | 5:18 PM

Home Remedies For Toothache: ఇటీవల కాలంలో చాలామంది పంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పంటి నొప్పి సమస్య చుట్టుముడుతోంది. పంటి నొప్పి వస్తే ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. ఏ పని అయినా చేయడం కష్టమవుతుంది. అందుకే.. పంటి నొప్పి వస్తే చాలామంది దంతవైద్యుడు లేదా దగ్గర్లో ఉన్న క్లినిక్ కు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని ఇంటి నివారణలను తీసుకోవచ్చు.. ఇవి సమస్యను వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.

పంటి నొప్పి తగ్గించుకోవడానికి హోం రెమెడిస్..

లవంగాలు: లవంగాలు ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది పంటి నొప్పిని నయం చేస్తుంది. ఇందుకోసం లవంగం నూనెను దూదితో నొప్పిగా ఉన్న దంతాలపై రాయాలి. దీంతో ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా లవంగాలను నమలడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: వెల్లుల్లిలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా పంటి నొప్పి అదృశ్యమవుతుంది. వెల్లుల్లి రెబ్బను కొద్దిగా తురుముకుని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఇది దంతాలలో ఉండే సూక్ష్మక్రిములను తొలగిస్తుంది.. అంతేకాకుండా నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఐస్ థెరపీ: పంటి నొప్పిని నయం చేయడానికి ఐస్ క్యూబ్స్ వాడటం చూసే ఉంటారు. ఇందుకోసం ఫ్రిజ్‌లోని ఐస్‌ని తీసుకుని.. రుమాలు లేదా ఏదైనా వస్ర్తంలో లేదా ఐస్ బ్యాగ్‌లో వేసి నొప్పి ఉన్న ప్రాంతంలో.. చెంపలపై పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలో చిగుళ్ళ వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకులు: జామ ప్రయోజనాల గురించి మీరు తప్పక వినే ఉంటారు. కానీ దాని ఆకులు కూడా చాలా ప్రయోజనకరమని నిపుణులు పేర్కొంటున్నారు. పంటి నొప్పి ఉంటే.. జామ ఆకులను నమలడం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఇదేకాకుండా జామ ఆకులను ఉడకబెట్టి నీటిని వడపోసి.. ఆ నీటిని మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..