ఫ్రిజ్ నుంచి నీచు కంపు వాసన వస్తోందా..? నిమిషాల్లో ఇలా దూరం చేసేయండి..

అప్పుడప్పుడు ఫ్రిజ్ నుండి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య.. ముఖ్యంగా ఉష్ణోగ్రత పెరిగి విద్యుత్ కోతలు వంటి సమస్యలు తలెత్తినప్పుడు. ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవడం ప్రారంభమవుతుంది. వాటి వాసన ఫ్రిజ్ అంతటా వ్యాపిస్తుంది. సకాలంలో ఫ్రిజ్ శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసనకు కారణం అవుతుంది. అయితే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. నిజానికి, కొన్ని సాధారణ పద్ధతులతో ఫ్రిజ్‌ను శుభ్రంగా, దుర్వాసన లేకుండా ఉంచవచ్చు. ఇందుకోసం మీ వంటగదిలో లభించే కొన్ని సాధారణ వస్తువులు ఉంటే సరిపోతుంది. బయటనుంచి ఏవీ కొనాల్సిన అవసరం లేదు.

ఫ్రిజ్ నుంచి నీచు కంపు వాసన వస్తోందా..? నిమిషాల్లో ఇలా దూరం చేసేయండి..
Bad Smell From Fridge

Updated on: Nov 08, 2025 | 5:37 PM

ఫ్రిజ్ ప్రతి ఇంటికి అవసరం. ఇది మన ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. అయితే, చాలాసార్లు ఫ్రిజ్ నుంచి నీచు వాసన, దుర్వాసన వస్తుంది. ఆ వాసన సాధారణంగా సరిగ్గా నిల్వ చేయని ఆహారం, పాడైన ఆహారం వల్ల వస్తుంది. ఫ్రిజ్ వాసనను వదిలించుకోవడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను తప్పక తెలుసుకోవాలి. ఇందు ఫ్రిజ్ స్విచ్‌ ఆఫ్ చేయండి. అన్ని ఆహార పదార్థాలను బయటకు తీయండి. లోపలి భాగాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. మొదట చెడిపోయిన లేదా కుళ్ళిపోయిన పదార్థాలను (పాత పాలు, కూరగాయలు, పండ్లు వంటివి) తీసేయండి. అలాగే ఒక గిన్నెలో బేకింగ్ సోడా ఉంచండి. ఇది సహజమైన డియోడరైజర్ లాగా పనిచేస్తుంది.

లేదంటే, మీ ఫ్రిజ్‌ నుంచి వచ్చే దుర్వాసనలను తొలగించడానికి ఒక ఓపెన్‌ బౌల్‌లో బేకింగ్ సోడా నింపి మీ రిఫ్రిజిరేటర్‌లోని ఏదైనా షెల్ఫ్‌లో ఉంచండి. ఇది రిఫ్రిజిరేటర్ నుండి వచ్చే వాసనలను పీల్చేసుకుంటుంది. మీరు ప్రతి నెలా లేదా మీరు చెడు వాసనను గమనించినప్పుడల్లా దాన్ని మార్చవలసి ఉంటుంది. వెనిగర్ సహజంగానే క్రిములను చంపుతుంది. దుర్వాసనలను తటస్థీకరిస్తుంది. వాసన తక్కువ సమయంలోనే మాయమవుతుంది.

ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో తెల్ల వెనిగర్, నీటిని సమాన భాగాలుగా కలపండి. ఈ ద్రావణాన్ని రిఫ్రిజిరేటర్ లోపలి ఉపరితలాలపై స్ప్రే చేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి. రిఫ్రిజిరేటర్ నుండి దుర్వాసనలను తొలగించడానికి ఇది చాలా సులభమైన మార్గం అంతేకాకుండా నిమ్మకాయ వాసన చెడు వాసనను పీల్చుకుంటుంది. రిఫ్రిజిరేటర్ను తాజాగా ఉంచుతుంది. అలాగే కొద్దిగా కాఫీ పొడిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాసన నిమిషాల్లో పోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us