AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాడిన, మొండి మరకలు వదలట్లేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.. రుద్దకుండా మిళమిళా మెరిపోతాయి

మనం ఇంట్లో వంట చేసేటప్పుడు పొరపాటున్న కొన్నిసార్లు పాత్రలు మాడిపోవడం మామూలే. ముఖ్యంగా పాలు వేడి చేస్తున్నప్పుడు, పాయసం లేదా నాన్‌వెజ్ కర్రీస్ చేసేప్పుడు చిన్న గాటు పడినా పాత్ర అడుగు భాగం నల్లగా మారిపోతుంది. ఇలా మాడిన పాత్రలను క్లీన్ చేయడం ఇంట్లో ఉండే ఆడవారికి ఒక పెద్ద యుద్ధంలా మారుతుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా వాటిపై మొండి మరకలను క్షణాల్లో మాయం చేయొచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

మాడిన, మొండి మరకలు వదలట్లేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.. రుద్దకుండా మిళమిళా మెరిపోతాయి
Remove Burnt Stains From Steel Pans
Anand T
|

Updated on: Jul 06, 2026 | 2:32 PM

Share

ఇంట్లో ఉన్న పాత్రలు మాడిపోయాయా?.. వాటిపై ఉన్న నల్లటి మొండి మరకలు గంటల తరబడి స్క్రబ్బర్‌తో గట్టిగా రుద్దినా పోవట్లేదా అయితే, మాడిన పాత్రలను వదిలించుకోవడానికి ఇకపై అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు.. వంట నిపుణులు ప్రకారం.. ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే కేవలం కొన్ని నిమిషాల్లో ఈ మొండ మరకలను పొగొట్టి పాత్రలను కొత్తవాటిలా మెరిపించవచ్చని సూచిస్తున్నారు. అదెలానో చూద్దాం.

బేకింగ్ సోడా – తెల్ల వెనిగర్ మ్యాజిక్

మాడిన మరకలను పొట్టడంలో సాధారణ డిటర్జెంట్ కంటే బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మాడిన పాత్రలో ఒక కప్పు నీరు, ఒక కప్పు వెనిగర్ పోసి బాగా మరిగించాలి. నీరు మరిగాక స్టవ్ ఆపేసి, అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. దాన్ని బాగా కలిపి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటిని పారబోసి, సాధారణ స్క్రబ్బర్‌తో తేలికగా రుద్దితే సరిపోతుంది. క్షణాల్లో మరకలు పోయి.. కొత్తదానిలా మెరిపోతుంది.

నిమ్మకాయ – ఉప్పు కాంబినేషన్

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజంగానే మొండి మరకలను తొలగించి, పాత్రలకు పూర్వపు మెరుపును అందిస్తుంది. కాబట్టి దీంతో ఈజీగా మరకలను దూరం చేయవచ్చు. ఇందుకోసం పాత్రలో తగినన్ని నీరు తీసుకుని, అందులో 2-3 నిమ్మకాయ ముక్కలు, రెండు చెంచాల ఉప్పు వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. వేడి నీటి వల్ల మాడిన పొర మెత్తబడుతుంది. ఆ తర్వాత నీటిని పారబోసి, ఉడికిన నిమ్మ తొక్కతో పాత్రపైను బాగా రుద్దితే మరకలు క్షణాల్లో మాయం అవుతాయి.

అల్యూమినియం ఫాయిల్ చిట్కా

మాడిన, మొండి మరకలను పొగొట్టడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ఇందుకోసం మీరు మాడిన ప్రదేశంలో కొద్దిగా బేకింగ్ సోడా, లిక్విడ్ డిష్‌వాష్ సబ్బు వేసి, కొద్దిగా గోరువెచ్చని నీరు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్క్రబ్బర్‌కు బదులుగా.. అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను ఒక చిన్న బంతిలా చుట్టి, దాంతో పాత్రపై రుద్దాలి. తర్వాత నీటితో కడిగితే చాలా ఆ మాడిన మరకలు క్షణాల్లో తొలగిపోతాయి.

అయితే పాత్ర మాడిన వెంటనే ఎప్పుడూ స్క్రబ్బర్‌తో పెట్టి గట్టిగా రుద్దవద్దు.. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా పాత్రల కోటింగ్ పాడైపోతుంది. మీరు నెక్ట్స్ టైం వంట చేస్తే అది త్వరగా మాడిపోతుంది. కాబట్టి, పైన పేర్కొన్న పద్ధతులలో ఏదో ఒకదానిని ఉపయోగించి ముందుగా మాడిన భాగాన్ని మెత్తబరిచిన తర్వాతే శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే