
పురాతన కాలంలో మన పూర్వికులు వంటి చేసుకునేందుకు మట్టి కుండలను ఉపయోగించేవారు. వాటిలో వండిన ఆహారం తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన పూర్వికులు ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువకాలం జీవించే వారు. అయితే కాలం, టెక్నాలజీతో పాటు వంటపాత్రలు కూడా మారుతూ వచ్చాయి. కానీ ఇప్పటికీ కొందరు మట్టి కుండల్లో వండుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే వాటిని శుభ్రం చేసే విషయంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు. మట్టి కుండలను సబ్బుతో కడుగుతున్నారు. ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి కుండలను ఎలా శుభ్రం చేయాలతో తెలుసుకుందాం.
పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఈ తప్పులను నివారించండి.
మట్టి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వాటిని సబ్బు లేదా ఇతర లిక్విడ్స్‌తో శుభ్రం చేయడం. ఇలా రసాయనాలతో మట్టి పాత్రలు శుభ్రం చేయడం ద్వారా మట్టి కుండకు ఉండే రంధ్రాలు ఈ రసాయనాలను పీల్చు్కుంటాయి. వాటిలో అలాగే ఆహారం వండినప్పుడు వేడి ఆవిరికి ఆ రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. కాబట్టి మట్టి కుండలను ఎప్పుడూ సబ్బు లేదా లిక్విడ్స్‌తో శుభ్రం చేయకండి.
మట్టి కుండలను ఎలా శుభ్రం చేస్తారు?
కొత్త మట్టి కుండలను ఉపయోగించటానికి చిట్కాలు
కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు వాటిలో వంట చేసినప్పుడు అందులో ఉండే మట్టి కణాల కారణంగా వంటకాలు చేదుగా మారొచ్చు. లేదా వేడికి కుండ పగిలిపోవచ్చు. కాబట్టి మీరు కొత్త కుండలో వంటచేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో తెలుసుకోండి. మీరు కొత్త మట్టి కుండను ఉపయోగిస్తుంటే, ముందు రోజు రాత్రి కుండ నిండా నీరు పోసి ఉంచండి. ఇది నీటిని పీల్చుకుంటుంది. వంటచేప్పుడు వేడికి పగిలిపోకుండా ఉంటుంది. ఇది వదులుగా ఉన్న బంకమట్టి నిక్షేపాలను కూడా తొలగిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.