Egg Float Test: ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో క్షణాల్లో తెలుసుకోండి!

గుడ్లు తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది వాటిని తినేందుకు ఇష్టపడుతారు. అయితే కొందరు ఒకేసారి బల్క్‌గా గుడ్లను ఇంటికి తెచ్చుకుంటారు. కానీ వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే, అవి చెడిపోతాయి. అయితే చెడిపోయిన పండ్లు, కూరగాయలను ఈజీగా కనిపెట్టొచ్చు. కానీ చెడిపోయిన గుడ్లను కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఒక సింపుల్‌ ట్రిక్‌తో చడిపోయిన గుడ్లను ఈజీ కనిపెట్టొచ్చు. అదెలానో చూద్దాం పదండి.

Egg Float Test: ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో క్షణాల్లో తెలుసుకోండి!
Egg Float Test

Updated on: Dec 15, 2025 | 7:38 PM

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో విటమిన్లు, అధిక ప్రోటీన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని డాక్టర్లు చెబుతారు. అయితే మనం కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో గుడ్లను తీసుకొచ్చినప్పుడు. వాటిలో కొన్ని పాడైపోయినవి ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా.. దీనివల్లే తరచుగా గుడ్లు చెడిపోతాయి. ఈ బ్యాక్టీరియా ఎంత వేగంగా పెరుగుతుందో, గుడ్డు అంత వేగంగా చెడిపోతుంది. అలా చెడిపోయిన గుడ్లను తింటే మనకు ఫుడ్‌పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

చెడిపోయిన గుడ్డును ఎలా గుర్తించాలి

ఫ్లోట్ టెస్ట్: గుడ్డు కుళ్ళిపోయిందో లేదో అనేది మీరు నీటిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీన్ని ఫ్లోట్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేయడానికి మీరు ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకోండి.. తర్వాత అందులో ఒక ఎగ్‌ను వేయండి. గుడ్డు నీటిలో మునిగిపోతే, అది తాజాగా ఉందని అర్థం. గుడ్డు సగం నీటిలో, సగం బయటకు ఉంటే అది చెడిపోయిందని అర్థం. గుడ్డు పూర్తిగా తేలితే, అది కుళ్ళిపోతుందని అర్థం.

ఫ్లాష్ లైట్ టెస్ట్: గుడ్డు కుళ్లిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది మరో పద్దతి. ఈ పద్ధతి గుడ్డు లోపలి భాగాన్ని చూడటానికి మీకు సహాయపడుతుంది. దీని కోసం, మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి.. దానిపై గుడ్డు ఉంచండి. గుడ్డు షెల్ ద్వారా స్పష్టమైన పసుపు రంగు కనిపిస్తే, అది తాజాగా ఉందని అర్థం. అదే గుడ్డు తెల్లగా కనిపిస్తే, అది కుళ్ళిపోయిందని అర్థం.

గుడ్డు కుళ్ళిపోయిందో లేదో తెలుసుకోవడానికి మరొక ప్రభావవంతమైన మార్గం వాసన చూడడం. కుళ్ళిన గుడ్లు, అవి పచ్చిగా ఉన్నా లేదా ఉడికించినా, దుర్వాసనను వెదజల్లుతాయి. వాటిని మీ ముక్కు దగ్గర పట్టుకుని వాసన చూడటం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.