
జేకబ్ డేవిస్‌తో కలిసి రాగి రివెట్ డిజైన్‌కు 1873లో పేటెంట్ పొందారు. 1900ల నాటికి లెవీస్ జీన్స్ కౌబాయ్స్, కార్మికుల్లో విశేష ఆదరణ పొందాయి. కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ బ్రాండ్, నేడు అత్యంత ప్రాచుర్యం పొందిన డెనిమ్ బ్రాండ్లలో ఒకటిగా కొనసాగుతోంది. లెవీస్ జీన్స్ 170 ఏళ్ల కథ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లెవీ స్ట్రాస్ ఒక జర్మన్-యూదు వలసదారుడు. 1853 లో అతను శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. 1858 నాటికి అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.
అయితే అతని దగ్గర తరచుగా వస్త్రాలు కొనే జేకబ్ డేవిస్ అనే టైలర్ కు ఒక సమస్య ఉండేది. అతని కస్టమర్ల ప్యాంటు జేబులు తరచుగా చిరిగిపోయేవి. గనుల్లో పని చేసే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండేది.
ఒకరోజు జేకబ్ కు ఒక ఆలోచన వచ్చింది. అతను ప్యాంటు జేబులకు రాగి రివెట్స్ (చిన్న బటన్లు) పెట్టి వాటిని బలంగా చేశాడు. ఈ డిజైన్ చాలా బాగుంది. కానీ జేకబ్ దగ్గర పేటెంట్ చేయడానికి డబ్బు లేదు.
అప్పుడు జేకబ్ లెవీ స్ట్రాస్ దగ్గరకు వెళ్లి తన ఆలోచన గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేయవచ్చని చెప్పాడు. లెవీ ఒప్పుకున్నాడు.
1873 మే 20న ఇద్దరూ కలిసి పేటెంట్ పొందారు. ఈ పేటెంట్ వార్షికోత్సవాన్ని లెవీస్ 501 జీన్స్ వార్షికోత్సవంగా పరిగణిస్తారు.
లెవీస్ అంతకు ముందు కూడా జీన్స్‌ను విక్రయించాడు. కానీ ఈ రాగి రివెట్ డిజైన్ చరిత్ర సృష్టించింది. 1890 లో ఈ పేటెంట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ 501 జీన్స్ మాత్రం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
1900 లలో లెవీస్ జీన్స్ ప్రజాదరణ బాగా పెరిగింది. కౌబాయ్స్, రైల్‌రోడ్ కార్మికులు ఈ జీన్స్‌ను ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఇవి చాలా రోజులు మన్నికగా ఉండేవి.
1930 నుండి జీన్స్ లుక్ మొదలైంది. ఓవర్‌ఆల్స్ లేకుండా ప్యాంటు తయారు చేయడం ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్లూ జీన్స్‌కు క్రేజ్ పెరిగింది. ఆ సమయంలో రక్షణ కోసం పని చేసే వారికి బ్లూ జీన్స్ ఒక అవసరంగా మారింది.
యుద్ధం తర్వాత కూడా జీన్స్ క్రేజ్ తగ్గలేదు. 1950 నాటికి బ్యాక్ పాకెట్ రివెట్స్ తొలగించబడ్డాయి. ఎందుకంటే అవి ఫర్నిచర్‌పై గుర్తులు పెడతాయని నమ్మేవారు.
బ్లూ జీన్స్ బాగా ఉతికిన తర్వాత రంగు తగ్గినప్పటికీ.. ఆ రంగు కూడా అందంగా కనిపించేది. అప్పటికి లెవీస్ పగ్గాలు వాల్టర్ హాడ్జ్, పీటర్ హాడ్జ్ చేతుల్లోకి వచ్చాయి. వారు ఒక కెనడియన్ సంస్థను కొనుగోలు చేశారు. అక్కడ నుండి స్టోన్ వాషింగ్ టెక్నిక్ను పొందారు. ఈ టెక్నిక్ నేటికీ ఉపయోగిస్తున్నారు.
1980 ల నాటికి కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. కానీ తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాని వేగం తగ్గింది. లెవీస్ తన అనేక కర్మాగారాలను మూసివేయవలసి వచ్చింది. ఆ సమయంలో డాకర్స్ బ్రాండ్ ప్రారంభించబడింది. ఇది విజయవంతమైనప్పటికీ 2004 లో కంపెనీ ఈ బ్రాండ్‌ను విక్రయించింది.
ఇన్నేళ్లలో లెవీస్ చాలా సార్లు తన వ్యాపార విధానాన్ని మార్చింది. కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నేడు కూడా ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద డెనిమ్ బ్రాండ్లలో ఒకటిగా ఉంది.