Alcohol: మద్యం తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే ఆల్కహాల్‌ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.? ఏ అవయవంపై ఎక్కువ ప్రభావం పడుతుంది...

Alcohol: మద్యం తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
Health

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 08, 2024 | 10:16 PM

బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మందు బాబులు మొదట చేసే పని ఓ పెగ్గు వేయడం. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మందు బాబుబుల మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. ఇంతకీ ఆల్కహాల్‌ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.? అసలు శరీరంలోని ఏ భాగంపై ఆల్కహాల్‌ ఎక్కువగా ప్రభావం చూపుతుందని లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ తీసుకున్న వెంటనే రక్తంలో కలుస్తుంది. దీంతో అది మెదడుకు సంకేతాలను పంపిస్తుంది. మొదట మాటల్లో తేడా వస్తుంది. ఆ తర్వాత శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇక ఆల్కహాల్‌ శరీరంలో ఎక్కువగా ప్రభావం చూపేది లివర్‌పైనే. శరీరంలో రెండో అతిపెద్ద అవయవమైన కాలేయం మనం తీసుకునే ఆహారం, తాగే వాటి నుంచి పోషకాలను ప్రాసెస్‌ చేస్తుంది. పోషకాలను అన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది.

ప్రతీరోజూ లేదా వారానికి 3 నుంచి 4 సార్లు అధికంగా ఆల్కహాల్‌ తీసుకుంటే.. కాలేయం దెబ్బతినే ప్రమాదం 5 నుంచి 10 ఏళ్లలో గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నం చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరైనా ఆల్కహాల్ తాగినప్పుడు, కాలేయం ఆల్కహాల్‌ను ఎసిటాల్డిహైడ్‌గా మార్చుతుంది. ఇది విషపూరిత సమ్మేళనం.

ఎసిటాల్డిహైడ్‌ను అసిటేట్‌గా మార్చిన తర్వాత, కాలేయంలో ఉండే ఎంజైమ్ దానిని కార్బన్ డయాక్సైడ్‌తో పాటు నీరుగా విభజించి శరీరం నుండి తొలగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయం ప్రతి గంటకు కొంత మొత్తంలో ఆల్కహాల్‌ను మాత్రమే జీర్ణం చేస్తుంది. అందుకే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలేయం దెబ్బ తినడానికి కారణమవుతుంది.

సాధారణంగా తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకున్న ఫిల్టర్‌ చేయడాని 2 నుంచి 4 గంటలు పడుతుంది. కాలేయం 6-12 గంటల్లో 3-5 పెగ్‌ల ఆల్కహాల్‌ను ఫిల్టర్ చేయగలదు. కాలేయం 6 పెగ్‌ల కంటే ఎక్కువ ఆల్కహాల్ క్లియర్ చేయడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఇక పరిమితికి మించి మద్యం సేవించే వారిలో లివర్‌ ఫిల్టర్‌ చేయడానికి కొన్ని సందర్భాల్లో రోజుల నుంచి వారాలు కూడా పడుతుండొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..