Sucess Story: నాడు ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకున్న వ్యక్తి.. నేడు ఏడాదికి 50 కోట్ల టర్నోవర్‌తో బిజినెస్..

|

Aug 29, 2021 | 11:28 AM

Sucess Story: కృషి, పట్టుదల, చేస్తున్న పని పట్ల అంకిత భావం.. ఉంటె మనిషి అంబరాన్ని అందుకోగలడు. సముద్ర లోతులను కొలవగలడు. చరిత్ర తనకంటూ ఓ పేజీ లిఖించుకోగలడు. ఈ విషయాన్నీ నాటి..

Sucess Story: నాడు ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకున్న వ్యక్తి.. నేడు ఏడాదికి 50 కోట్ల టర్నోవర్‌తో బిజినెస్..
Business Man Biren
Follow us on

Sucess Story: కృషి, పట్టుదల, చేస్తున్న పని పట్ల అంకిత భావం.. ఉంటె మనిషి అంబరాన్ని అందుకోగలడు. సముద్ర లోతులను కొలవగలడు. చరిత్ర తనకంటూ ఓ పేజీ లిఖించుకోగలడు. ఈ విషయాన్నీ నాటి మహాభారతంలోని కర్ణుడు, ఏకలవ్యుడి నుంచి నేటి భారతంలోని అనేక మంది రుజువు చేశారు. ఈ కోవలోకి వస్తాడు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారి. అతను ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి బతుకు బండి కోసం ఎన్నో పోరాటాలు చేశాడు.. రోడ్డు మీద తిరుగుతూ చీరలకు అమ్మాడు .. కష్టాన్ని ఇష్టంగా పడి.. అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌గా అతనే బీరెన్ కుమార్ బసక్. వివరాల్లోకి వెళ్తే..

బంగ్లాదేశ్‌లో పుట్టిన బీరెన్ కుమార్ బసక్ 13 ఏళ్ల వయసులో 1962లో భారత్ కు వలస వచ్చాడు. కోల్ కతాకు చేరుకున్న బీరెన్ తండ్రి, అన్నతో కలిసి వీధుల్లో తిరుగుతూ చీరలు అమ్మడు.. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. ఇక జీవితంలో స్థిరపడినట్లే అనుకునే సమయంలో అన్నతో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో తాను కష్టపడి పెంచిన బిజినెస్ ను అన్నయ్యకు అప్పగించి అక్కడ నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ లైఫ్ జర్నీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు.. మళ్ళీ బిజినెస్ లో మొదటి అడుగు వేశాడు.. తన కష్టాన్ని నమ్ముకుని.. వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

ఉత్త చేతులతో బాంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఫులియా జిల్లాకు వలన వచ్చిన బీరెన్.. బాల్యం నుంచే అనేక కష్టాలు పడ్డాడు. దీంతో పొట్ట కూటి కోసం చదువుని పక్కకు పెట్టి.. ఏదోపనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీరెన్ తన చదువును ఆరో తరగతితోనే ఆపేసి తండ్రి, సోదరుడితో కలిసి కోల్‌కతా వీధుల్లో చీరలు అమ్మేవాడు. అయితే ఎంత కష్టపడినా రోజుకు రూ.3కి మించి సంపాదించలేకపోయేవారు. అలా చాలీచాలని డబ్బులతో జీవితంలో ఎన్నో ఏళ్ళు గడిపాడు. అయిదు బీరెన్ కు అదృష్ట దేవత స్థానిక ఎమ్మెల్యే భార్య రూపంలో తలుపు తట్టింది.

ఒకరోజు బీరెన్ అమ్ముతున్న చీరలను స్థానిక ఎమ్మెల్యే భార్య చూసింది. చీరలు ఆమె కు నచ్చడంతో వాటిని తన ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. బీరెన్ ఎమ్మెల్యే ఇంటికి చీరకు తీసుకుని వెళ్లే సమయంలో అక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. అక్కడున్న మహిళలందరికీ బీరెన్ అమ్ముతున్న చీరలు నచ్చాయి. దీంతో మొత్తం చీరలు ఎమ్మెల్యే భార్య, ఆమె స్నేహితులు కొనేశారు. దీంతో అప్పుడు బీరెన్ మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో లాభం చూశాడు. ఇక ఆ నోటా ఈ నోటా బీరెన్ చీరాల గురించి స్థానికులకు తెలిసింది. ఇక ఆ వీధిలోనూ, ఆ ప్రాంతంలోనూ బీరేన్ చీరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. లాభాల బాట పట్టాడు.. వెంటనే కోల్‌కతాలోని ఓ షాపు కొని సొంతంగా ఓ బట్టల దుకాణం నిర్మించాడు.

దుకాణం తెరవడంతో లాభాలు మరింత పెరిగాయి. అయితే 1985లో బీరేన్‌కు, తన సోదరుడికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తాను ప్రారంభించిన బట్టల షాపుని అన్నయ్యకు ఇచ్చేసి మళ్ళీ కొత్త షాపు తెరిచాడు. నాణ్యమైన చీరలు తయారు చేయించి వినియోగదారులను ఆకట్టుకున్నాడు.

ఓ వైపు తన దుకాణం వద్దకు వచ్చే మహిళలకే కాదు.. వీధుల్లో చీరలు అమ్ముకునే వారందరినీ పోగేసి తన చీరలు అమ్మించేవాడు. దీంతో బీరేన్ చీరలు బెంగాల్ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.ఏమీ లేని స్టేజ్ నుంచి బీరెన్ ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న బిజినెస్ మెన్ గా మారాడు.. బీరెన్ చీరలు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ భార్య , బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్ల కొనుగోలు చేస్తారు.నేడు 70 ఏళ్ల బీరెన్ పద్మ శ్రీతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. రూ .50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ తో బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 1987 లో కేవలం ఎనిమిది మందితో తన సొంత దుకాణాన్ని తెరిచి, తన వ్యాపారాన్ని దశలవారీగా విజయానికి నడిపించి నేడు దేశవ్యాప్తంగా చేనేత చీరలను విక్రయిస్తున్నాడు. అతని వద్ద 24 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 5,000 మంది నేత కార్మికులతో పని చేస్తున్నారు.

Also Read: Cat Rescue: మానవత్వం పరిమళించినవేళ.. పిల్లిని పట్టారు.. రాజుగారి ప్రశంసలతో పాటు.. పదిలక్షల రివార్డును అందుకున్నారు