Lungs Health Tips: కరోనావైరస్ మహమ్మారి వల్ల మన శరీరంలో ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవం ఊపిరితిత్తులు. కోవిడ్-19 నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇది శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కరోనా కేసుల్లో ముఖ్యంగా శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి కనిపించాయి. అయితే.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులను దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తులు శరీరమంతటా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఆక్సిజన్ సరిగ్గా శరీరానికి చేరకపోతే.. అది కణాలపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
దృఢమైన ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం..
1- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
2- ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి
3- నూనె, నెయ్యి పదార్థాలు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
4- గుడ్లు, మీట్ లాంటివి తినాలి.
5- గొంతును ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఇలాంటి వ్యాయామాలు చేయండి..
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. దీనిని టీవీ9 నిర్ధారించలేదు. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..