బ్లడ్ షుగర్.. ఇది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారిపోయింది. చాపకింద నీరులా సోకే ఈ వ్యాధి.. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. మధుమేహ రోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక మందులు వాడుతుంటారు. ఇన్సులిన్ ఇంజక్షన్లు కూడా తీసుకుంటారు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలను సహజ పద్ధతుల ద్వారా కూడా నియంత్రించవచ్చు. మధుమేహం జన్యుపరంగా ఉండవచ్చు. కానీ, ఇది సాధారణంగా చెడు ఆహారం, అనారోగ్య జీవనశైలి కారణంగా వస్తుంది. మధుమేహం కోసం శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన నివారణను కనుగొనలేదు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు. అందులో కొన్ని ఆకుపచ్చ మొక్కలు, కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. కరివేపాకు : కరివేపాకులను సాధారణంగా దక్షిణ భారత వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు కరివేపాకుతో టీ తయారు చేసి తాగినట్టయితే.. చక్కటి ఫలితాలు పొందుతారు. షుగర్ బాధితులకు కరివేపాకు టీ మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.
2. తిప్పతీగ : ఈ మొక్క నుండి పొందిన మూలికలు కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగించబడ్డాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే తిప్పతీగ నుంచి తీసిన రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
3. వేప ఆకులు : వేప ఔషధ గుణాల గురించి అందరికీ తెలుసు. దాని ఆకులు, పువ్వులు, పండ్లు, బెరడు, కలప ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఉదయం నిద్ర లేవగానే వేప ఆకును నమిలితే గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
4. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ మొక్క కూడా దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇన్సులిన్ మొక్క ఆకుల సహాయంతో రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. ఈ మొక్కలో ఉండే సహజ రసాయనాలు చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తాయి, ఇది జీవక్రియ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఇన్సులిన్ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులను నమలడం ద్వారా, మీరు మీ చక్కెరను చాలా వరకు నియంత్రించవచ్చు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..