Holi Specials: పండుగ ఒకటే.. చేసుకునే విధానం రాష్ట్రానికో తీరు.. హోలీ పండుగ ప్రత్యేకతలు మీ కోసం

చాలా మంది హోలీ అంటే రంగుల పండుగ అనుకుంటారు. ముఖ్యంగా అందిరిపై సంతోషంగా రంగులు పూయడమే ఈ పండుగ పరమార్థం అని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో దీపావళి తర్వాత అందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ హోలీ.

Holi Specials: పండుగ ఒకటే.. చేసుకునే విధానం రాష్ట్రానికో తీరు.. హోలీ పండుగ ప్రత్యేకతలు మీ కోసం
Holi

Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2023 | 4:24 PM

భారతదేశం విభిన్న సంస్కృతి కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పండుగల సమయంలో రాష్ట్రాన్ని బట్టి చేసుకునే విధానంలో మార్పులు ఉంటాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది హోలీ అంటే రంగుల పండుగ అనుకుంటారు. ముఖ్యంగా అందిరిపై సంతోషంగా రంగులు పూయడమే ఈ పండుగ పరమార్థం అని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో దీపావళి తర్వాత అందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ హోలీ. దేశంలోని అన్ని చోట్ల యువత ఎక్కువగా కేరింతలతో ఈ పండుగను జరపుకుంటారు. అయితే రాష్ట్రానికో తీరుగా హోలీ పండుగను జరుపుకుంటారని తెలుసా? ముఖ్యంగా కుటుంబ బంధాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. హోలీ పండుగను ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో? ఓ సారి తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లో లత్మార్ హోలీ

ఉత్తరప్రదేశ్‌లో యువత ఎక్కువగా లత్మార్ హోలీని జరపుకుంటారు. శ్రీ క‌ృష్ణుడు బర్సానాను సందర్శించే కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఎక్కువ యువత ఇక్కడ ఈ రకమైన హోలీని ఆడతారు. రాధ, ఆమె స్నేహితులు హోలీ ఆడుతున్నప్పుడు చిలిపివాడైన శ్రీకృష్ణుడు వాళ్లకి రంగులు పూస్తాడు. ఈ నేపథ్యాన్ని తీసుకుని నేటికి అక్కడ యువకులు శ్రీకృష్ణుని వేషధారణలో ఉండగా రాధ వేషధారణలో ఉన్న యువతులు కలిసి హోలీ ఆడడం ప్రత్యేకత. ప్రస్తుతం నందిగావ్‌లో ఉన్న బర్సానా ప్రాంతం వద్ద హోలీ ఆడడానికి అధిక సంఖ్యలో యువత సందర్శిస్తూ ఉంటారు. 

హర్యానాలో దులంది హోలీ

దులంది అంటే హర్యానాలో కోడలు అని అర్థం. హోలీ పండుగ  వారు దేవర్ అంటే తమ బావమరిదులను చిలిపిగా ఆటపట్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతికారం నేపథ్యంలో ఈ ప్రాంతంలో హోలీ జరుగుతుంది. అది కూడా స్నేహపూర్వకంగా ఇక్కడ పండుగను జరుపుకుంటారు. 

ఇవి కూడా చదవండి

బృందావన్ పులోన్ కీ హోలీ

హోలీ అంటే కృష్ణుడు, రాధా, గోపికలతో ఆడే మధురమైన ఆటగా అందరూ అనుకుంటారు. ఫూలోన్ కి హోలీని బంకే బిహారీ దేవాలయం, బృందావన్‌లో కృష్ణ శిష్యులు గొప్ప ఉత్సాహంతో తాజా పూల రేకులతో ఆడతారు. ఈ పూలతో నిండిన వాతావరణంలో అద్భుతంగా ఉంటుంది. హోలీ అంటేనే ప్రేమ, సంతోషంగా ఇక్కడి వారు భావిస్తారు.

మహారాష్ట్రలో రంగ పంచమి

శ్రీ కృష్ణుడు చిలిపిగా వెన్నదొంగలించే వాడు. వెన్నదొంగ నుంచి తమ వెన్నను దాచుకోవడానికి ఎత్తయిన ప్రాంతంలో కుండలను వేళ్లాడదీసేవారు. అయినా శ్రీకృష్ణుడు స్నేహితులతో కలిసి వెన్నను దొంగలించేవాడు. ఇంచుమించు ఇక్కడ జరపుకునే హోలీ కృష్ణాష్టమి తరహాలో ఉంటుంది. 

పశ్చిమ బెంగాల్లో బసంత్ ఉత్సవ్

కోల్‌కతాలోని శాంతినికేతన్‌లోని విశ్వవిద్యాలయంలో పాటలు, నృత్యం, శ్లోకాలతో హోలీని ఆనందంగా జరుపుకుంటారు. దీన్ని వారు బసంత్ ఉత్సవ్‌గా పిలుచుకుంటారు. బెంగాల్‌లో హోలీని చాలా వైభవంగా జరుపుకుంటారు 

బీహార్‌లో పాల్గుణ పూర్ణిమ

ప్రహ్లాదుడు హోలికాపై గెలిచిన పౌరాణిక కథ నేపథ్యంలో ఇక్కడ హోలీని జరుపుకుంటారు . ఫాల్గుణ పూర్ణిమ సందర్భంగా హోలికా దహన్ అని పిలవబడే ఆవు పేడ రొట్టెలు, తాజా పంట నుంచి ధాన్యాలు, హోలికా చెట్టు కలపను పెట్టి భోగి మంటలు వెలిగిస్తారు. బీహార్‌లో హోలీని కొత్త సంవత్సరం ప్రారంభంగా పేర్కొంటారు. అలాగే బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మట్టితో కూడా ఆడతారు. దీనిని ప్రత్యేకంగా కీచద్ వాలి హోలీ అని పిలుస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..