
మీ శరీరంలో అధిక కలెస్ట్రాల్ ఉంటే మీ చేతి వేళ్లలో గోళ్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ శరీరంలో రక్త ప్రసరణ మందగించినప్పుడు. రక్తనాళాలు కుంచించుకుపోయి గోళ్ల చివరి భాగాలకు రక్తం వెళ్లదు. దీని కారణంగా గోళ్లు వాటి సహజమైన గులాబీ రంగును కోల్పోయి, తెల్లగా లేదా పాలిపోయినట్లు మారుతాయి. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు అధిక కలెస్ట్రాల్ సమస్య ఉన్నట్టు అర్థం.
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు
పెళుసైన గోళ్లు: గోళ్లకు సరిపడ రక్త ప్రసరణ, ఆక్సిజన్ , పోషకాలు అందనప్పుడు అవి బలహీనంగా మారుతాయి. దీని కారణంగా చిన్న గాయం తగిలిగా గోళ్లు విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. లేదా అవి పొరలు పొరలుగా రాలిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అది రక్త ప్రసరణ లోపానికి సంకేతం కావచ్చు.
గోళ్లపై నిలువు గీతలు: అయితే చాలా మంది వయస్సు మీద పడుతున్న కొద్ది గోళ్లపై గీతలు రావడం అనేది సహజం. కానీ ఉన్నట్టుండి మీ గోళ్లపై నిలువు గీతలు కనిపిస్తే అది రక్త ప్రసరణ మందగించడమే. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో మాత్రమే రక్త ప్రసరణ మందగించి గోళ్ల కణజాలం దెబ్బతింటుంది. దీని వల్లే మీ గోళ్లలో నిలువు గీతలు కనిపిస్తాయి.
గోళ్ల పెరుగుదల ఆగిపోవడం: అయితే మీ గోళ్ల పెరుగుదల అనేది సడెన్‌గా ఆగిపోయినా, లేదా గోళ్లు పెరుగుదల నెమ్మదించినా ఇది అధిక కోలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పోషకాలు అందక గోళ్ల పెరుగుదల నెమ్మదిస్తుంది.
పసుపు రంగు గోళ్లు: కొన్ని సార్లు చేతి గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా గోళ్లు ఇలా మారుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని సార్లు ఇది అధిక కొలెస్ట్రాల్‌కు కూడా కారణం కావచ్చు. కాబట్టి మీ గోళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా సేకరించినవి. కాబట్టి వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. వీటిని టీవీ 9 దృవీకరించట్లేదు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.