ఇంటిలోని ఈ హాట్ స్పాట్‌ లు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే..! ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దు..!

ప్రతి రోజు పని ఒత్తిడి లో ఉండటం వల్ల ఇంటిని పూర్తిగా శుభ్రం గా ఉంచడం సాధ్యపడదు. అయినప్పటికీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు తప్పనిసరిగా శుభ్రంగా ఉండాలి. లేకపోతే వైరస్‌ లు, బ్యాక్టీరియాలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ఇంటిలోని ఈ హాట్ స్పాట్‌ లు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే..! ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దు..!
Cleaning Tips For A Hygienic Home

Updated on: Jun 29, 2025 | 9:25 PM

ఇంట్లో వంటగదిలో, డైనింగ్ టేబుల్ మీద లేదా భోజనం చేసే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు శుభ్రత అవసరం. వాడిన వెంటనే ప్లేట్లు, బౌల్స్, స్పూన్లు శుభ్రం చేయకపోతే అవి బ్యాక్టీరియాకు నివాసంగా మారతాయి. వంటగదిలో స్టవ్‌, మైక్రోవేవ్‌, కటింగ్ బోర్డ్స్ వంటి వస్తువులను వాడిన తర్వాత వెంటనే తుడిచి శుభ్రపరచాలి.

వంట చేస్తుంటే కూరగాయ ముక్కలు, చినుకులు కౌంటర్ మీద పడతాయి. ఇవి వెంటనే శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఇంకా మురికి పేరుకుపోతుంది. నీటితో తుడిచిన తర్వాత డిజిన్ఫెక్టెంట్‌ తో శుభ్రం చేయడం మంచిది.

బాత్రూమ్‌ లో షాంపూలు, బాడీవాష్, షేవింగ్ క్రీమ్ వాడిన తర్వాత వాటి ఆనవాళ్లు మిగిలిపోతాయి. ఇవి గోడలపై, ఫ్లోర్‌ పై పడి మురికిని పెంచుతాయి. వారానికి కనీసం రెండుసార్లు బాత్రూమ్‌ ను పూర్తిగా శుభ్రం చేయడం అవసరం. ఫంగస్, బ్యాక్టీరియా నివారణకు ఇది చాలా సహాయపడుతుంది.

మీరు ఇంట్లో ఉన్నా.. బయట ప్రయాణాలు చేస్తున్నా టాయిలెట్ సీటును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంట్లో అయితే వారానికి కనీసం ఒక్కసారైనా టాయిలెట్ క్లీనర్ లేదా క్రిమిసంహారక మందుతో (డిస్‌ఇన్ఫెక్టెంట్) శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. అలా శుభ్రం చేయకపోతే టాయిలెట్ సీటుపై ఉండే మురికి కణాలు, బ్యాక్టీరియా మీ శరీరానికి అంటుకుని ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

బ్రష్ చేసిన తర్వాత పేస్ట్ లేదా నీరు వాష్‌ బేసిన్‌ లో పడిపోతుంటాయి. ఇవి అలాగే వదిలేస్తే తేలికపాటి మురికి పెరిగి నల్లగా మారుతుంది. దీనిని వెంటనే శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చోట డిజిన్ఫెక్టెంట్ లేదా సహజమైన క్లీనింగ్ పదార్థాలు వాడాలి.

ఇలాంటి హాట్ స్పాట్‌ లను నిర్లక్ష్యం చేస్తే వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు మొదలైనవి ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.