Pumpkin Juice: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

|

Dec 22, 2022 | 12:56 PM

అధిక బరువు ఉండడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. అయితే అధిక బరువును ఇంట్లోని కూరగాయల, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల తగ్గించవచ్చని మీకు తెలుసా..? ముఖ్యంగా గుమ్మడికాయతో బరువు..

Pumpkin Juice: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
Pumpkin Juice
Follow us on

ప్రస్తుత కాలంలో ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా ఉండడం సహసోపేతమైనదిగా మారింది. కానీ తప్పనిసరి పరిస్థితి. అయితే మనకు కలిగే ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే. మన శరీరాన్ని అనేక వ్యాధులు ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. నేటి కాలంలో మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో బీపీ, షుగర్, డయాబెటీస్, అధిక బరువు వంటివాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో అధిక బరువు అనేది మాత్రమే నలుగురిలో మనల్ని నవ్వులపాటు చేస్తుంది. అంతేకాక అధిక బరువు ఉండడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది.

అయితే అధిక బరువును ఇంట్లోని కూరగాయల, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల తగ్గించవచ్చని మీకు తెలుసా..? ముఖ్యంగా గుమ్మడికాయతో బరువు తగ్గవచ్చు. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ఇంకా గుమ్మడికాయలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనేక సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయతో పాటు దాని రసం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి గుమ్మడికాయ రసాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలా తయారు చేయాలి..?: 

గుమ్మడికాయ రసం చేయడానికి పండిన గుమ్మడికాయ ముక్కలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల నుంచి తొక్కలను తొలగించిన తర్వాత ఓవెన్ లేదా కుక్కర్‌లో ఉడికించాలి. తర్వాత బాగా రుబ్బుకొని దానిలో యాపిల్ ముక్కలను వేసి బాగా కలపాలి. అనంతరం ఈ రసాన్ని తాగవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని రోజూ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయ రసంతో ప్రయోజనాలు:

1. గుమ్మడికాయ రసం తాగడం మీ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇందులోని పీచు మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే మీరు బరువు తగ్గడంలో కూడా గుమ్మడికాయ మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

2. గుమ్మడికాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతేకాకుండా ఇది వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..