సమయానికి నిద్రపోవడం లేదా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

|

Jun 07, 2019 | 1:01 PM

బిజీ బిజీ లైఫ్‌లో పడి చాలా మంది కంటి నిండా నిద్రపోవడం లేదు. రోజుకి 6 గంటలు కాదు కదా.. సుమారు 3 గంటలు కూడా నిద్రపోవడం లేదు. రాత్రి సమయంలో పడుకోవాల్సిన వాళ్లు ఉదయం పడుకుంటున్నారు. ఉదయం పనిచేయాల్సిన వాళ్లు రాత్రి పనిచేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా బరువు పెరగడం, ఉద్యోగ సమయాలు మారడం, మానసిక, ఆర్థిక సమస్యలు, టీవీలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లలో కబుర్లు నిద్రను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ చాటింగ్ చేస్తూ అర్థరాత్రి రెండు, […]

సమయానికి నిద్రపోవడం లేదా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!
Follow us on

బిజీ బిజీ లైఫ్‌లో పడి చాలా మంది కంటి నిండా నిద్రపోవడం లేదు. రోజుకి 6 గంటలు కాదు కదా.. సుమారు 3 గంటలు కూడా నిద్రపోవడం లేదు. రాత్రి సమయంలో పడుకోవాల్సిన వాళ్లు ఉదయం పడుకుంటున్నారు. ఉదయం పనిచేయాల్సిన వాళ్లు రాత్రి పనిచేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువగా బరువు పెరగడం, ఉద్యోగ సమయాలు మారడం, మానసిక, ఆర్థిక సమస్యలు, టీవీలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లలో కబుర్లు నిద్రను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ చాటింగ్ చేస్తూ అర్థరాత్రి రెండు, మూడు దాటినా నిద్రపోని వారు చాలామంది ఉన్నారు. 100లో దాదాపు 90 శాతం మంది ప్రజలు 8 గంటల పాటు నిద్రపోవడం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ప్రధానంగా నిద్రలేమి సమస్య నగరవాసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాల్ సెంటర్లు, సాఫ్ట్‌వేర్, బీపీవో, ఐటీ ఉద్యోగులు సమయానికి నిద్రపోవడం లేదని.. నిద్రలేమి కారణంగా ఆఫీసుల్లో సరిగా వర్క్ చేయడకుండా ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

కంటి నిండా సరైన నిద్రలేకపోవడం వల్ల మానసికంగా చిరాకుగా ఉండటం, భయం, ఒత్తిడులకు గురికావడం జరుగుతుంది. బీపీ పెరగడం, గుండె స్పందనలో మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.